మారకపోతే ఆ ఎమ్మెల్యేల ఫేట్ మారుతుందా? ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలపైనే చంద్రబాబు ఎందుకు ఫోకస్ పెట్టారు?

Follow

ఎమ్మెల్యే మంచివాడనే పేరొస్తే నాలుగు ఓట్లు అదనంగా వస్తాయి. చెడ్డవాడంటే నాలుగు ఓట్లు పోతాయి..ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు ఏదైనా విమర్శ వస్తే సమాధానం చెప్పండి. చేసిన పనితో పాటు..కొన్ని ఎందుకు చేయలేకపోయామో తెలియజేయండి అంటూ ఎమ్మెల్యేలకు మరోసారి దిశానిర్ధేశం చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు పార్టీ మీటింగ్‌కు అటెండ్ కాకపోవడంపై సీరియస్ అయిన బాబు..పార్టీ కంటే ఇతర కార్యక్రమాలే ఇంపార్టెంటా అంటూ ఫైరయ్యారు.
పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకే రానివారు..ఇక తమ నియోజకవర్గాలకు ఏం చేస్తారని మండిపడ్డారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక అక్కడే ఉండటం బెటరని కూడా చురకలు అంటించారు. నియోజకవర్గాలకు దూరంగా ఉండటం సరికాదు..ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలి..ప్రజలతో మమేకం కావాలని కాస్త గట్టిగానే చెప్పారు చంద్రబాబు.
చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించడం, అలర్ట్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలపై అయితే ఫోకస్ కాస్త ఎక్కువే పెట్టారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో పార్టీ సీనియర్ లీడర్లను కూడా పక్కకు పెట్టి..కొత్తతరం లీడర్లకు అవకాశం ఇవ్వాలని..దాదాపు 50మంది వరకు కొత్త ముఖాలను ఎన్నికల బరిలోకి దించారు చంద్రబాబు.
అందులో మెజార్టీ నేతలు ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెల్వడం, ఎమ్మెల్యే అవడం వరకు వాళ్ల పనితీరు బానే ఉన్నా..ఆరు నెలలుగా అయితే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేస్‌లో చాలా మంది రిలాక్స్ మోడ్‌లో ఉంటున్నారట. క్యాడర్‌కు, లీడర్లకు అందబాటులో ఉండకుండా..హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లేకపోతే విదేశాల్లో గడుపుతున్నారట. ఇదే చంద్రబాబుకు కోపం తెప్పిస్తుందని అంటున్నారు. యంగ్ బ్లడ్ రాజకీయాల్లోకి రావాలని మరీ సీనియర్లతో బద్నా అయి..సీట్లు ఇస్తే గెలిచి ప్రజల్లో ఉండాకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంపై సీరియస్‌గా ఉన్నారట చంద్రబాబు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నా..మళ్లీ గెలవాలని..ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవడం లేదట.
అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన బానే ఉందన్న టాక్ తెచ్చుకుంది. చెప్పినట్లుగా ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ..ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉన్నా.. అవి కూడా త్వరలోనే నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజలకు ఉందన్న రిపోర్టులు కూడా చంద్రబాబుకు ఉన్నాయట. అయినా ఎమ్మెల్యేల పనితీరు మీద ఫోకస్ పెట్టడానికి రీజన్ లేకపోలేదంటున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఎంత బాగున్నా..సీఎం మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నా..లోకల్‌గా పబ్లిక్‌తో ఎమ్మెల్యేల అటాచ్‌మెంట్ అనేది కూడా గెలుపోటములను డిసైడ్ చేస్తుందని భావిస్తున్నారట చంద్రబాబు.
నెగెటివ్ ఫీడ్ బ్యాక్.. సరి చేసుకోవాల్సిందే..
తన నిర్ణయాల వరకు..స్కీమ్‌ల ఇంప్లిమెంట్‌లో ఎక్కడా తేడా లేకున్నా..ఎమ్మెల్యేలపై ఉన్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌ను సరి చేసుకోవాలని చూస్తున్నారట. అటు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పనితీరుతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు..ఇంకా విలేజ్ లెవల్‌లో సర్పంచ్, ఎంపీటీసీల తీరు బాగుంటేనే..మళ్లీ మళ్లీ అధికారంలోకి వస్తామని అంచనా వేస్తున్నారట. అందుకే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు కానిస్టిట్యూయెన్సీ మీద కాన్సంట్రేషన్ చేస్తే గెలుపు ఈజీ అవుతుందని..ఎక్కడో ఉండి..మానిటరింగ్ చేస్తానంటే కుదరదంటూ తేల్చి చెబుతున్నారట చంద్రబాబు.
స్టేట్ లెవల్‌లో సీఎంగా తనకు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌కు ఎంత మైలేజ్ ఉన్నా..ఎమ్మెల్యేల పనితీరు బాలేకపోతే కథ మొదటికి వస్తుందని అనుకుంటున్నారట చంద్రబాబు. లోకల్ లీడర్లే ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పార్టీ అన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. అయితే ఏదైనా తేడా కొట్టాక..వాళ్ల వల్లే ఓడాం..వీళ్ల పనితీరే నష్టం చేసిందని పోస్ట్ మార్టం చేసుకునే బదులు ఇప్పటినుంచే అన్నీ సెట్‌రైట్ చేసుకోవాలని..ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు. అందుకే పదేపదే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేల వెంటపడుతూ..మార్పులు, చేర్పులు ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు. చంద్రబాబు సూచనలతో అయినా ఎమ్మెల్యేల ఫేట్ ప్లేట్ ఫిరాయించకుండా జాగ్రత్త పడుతారా లేదా అన్నది చూడాలి మరి.
స్టేట్ లెవల్‌లో సీఎంగా తనకు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌కు ఎంత మైలేజ్ ఉన్నా..ఎమ్మెల్యేల పనితీరు బాలేకపోతే కథ మొదటికి వస్తుందని అనుకుంటున్నారట చంద్రబాబు.