మావోయిస్టు నేత గణేశ్ ఎన్కౌంటర్.. ఏవోబీ సభ్యురాలు అరుణ, ఏరియా కమిటీ సభ్యుడు అంజు కూడా మృతి

Follow

- గాజర్ల రవిపై రూ.కోటి నగదు రివార్డు
- 2004లో సర్కారుతో చర్చల్లో పాల్గొన్న రవి
- అప్పటి ప్రతినిధుల్లో ఇప్పటికే నలుగురి మృతి
- రవి మృతితో చిన్నబోయిన వెలిశాల గ్రామం
వరంగల్, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తగూడెం ప్రగతి మైదాన్/జయశంకర్ భూపాలపల్లి, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/టేకుమట: మావోయిస్టు అగ్రనేత, 2004 చర్చల్లో ఆనాటి సర్కారుతో జరిగిన చర్చల్లో హాజరైన ఆఖరి నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ సహా మరో ఇద్దరు కీలక నేతలు ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ ముగ్గురు అగ్రనేతలు మృతిచెందారు. రంపచోడవరం-మారేడుమిల్లి అటవీ ప్రాం తంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గ్రేహౌండ్స్ భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య సుమారు రెండు గంటలపాటు భీకర ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుతున్నది. భద్రతా దళాల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఘటనా స్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమి టీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేశ్ అలియాస్ బిరుసు, ఏపీ రాష్ట్ర కమిటీ, ఏవోబీ సభ్యురాలు వెంకటరవి లక్ష్మీచైతన్య అలియాస్ అరుణ అలియాస్ రూపి, మరొకరిని ఏరియా కమిటీ సభ్యుడు అంజుగా పోలీసులు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి(సీసీఎం)పై మూడు రాష్ర్టాల్లో కలిపి రూ.కోటి నగదు రివార్డు, ఏపీ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం గ్రామానికి చెందిన అరుణ (ఎస్‌జెడ్‌సీఎం)పై రూ.25 లక్షల నగదు రివార్డులు ఉన్నాయి. గత జనవరి 21న ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు గరియాబంద్ జిల్లా కులరీఘాట్ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్యే అరుణ. శాంతి చర్చలు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ విడుదల చేసిన ఆమె.. తాజా ఎన్కౌంటర్లో మృతిచెందారు.
ముగిసిన శాంతిచర్చల ప్రతినిధుల ప్రస్థానం
మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి ఎన్‌కౌంటర్‌తో 2004లో ఆనాటి సర్కారుతో జరిగిన శాంతిచర్చల్లో హాజరైన ప్రతినిధుల విప్లవ ప్రస్థానం ముగిసినట్టయింది. గాజర్ల రవి మరణంతో చర్చల్లో పాల్గొన్న వారి ఉద్యమ ప్రస్తానంపై చర్చ జరుగుతున్నది. గాజర్ల రవి మూడున్నర దశాబ్దాల అజ్ఞాత జీవితానికి తెరపడింది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విప్లవ పార్టీల తరఫున ఐదుగురు అగ్రనేతలు ఆనాటి చర్చల్లో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), చలం (సుధాకర్), గాజర్ల రవి(గణేశ్), జనశక్తి తరఫున రియాజ్, కూర దేవేందర్ (అమర్) పాల్గొన్నారు. కాలక్రమంలో వీరిలో ముగ్గురు భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో, ఒకరు అనారోగ్యంతో మరణించారు. చర్చల్లో పాల్గొన్న జనశక్తి పార్టీ నేత అమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు
మావోయిస్టు అగ్రనేత, 2004 చర్చల్లో ఆనాటి సర్కారుతో జరిగిన చర్చల్లో హాజరైన ఆఖరి నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ సహా మరో ఇద్దరు కీలక నేతలు ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ ముగ్గురు అగ్రనేతలు మృతిచెందారు.