మిసైళ్ల రూపురేఖలు మార్చే ప్రయోగం.. గ్లోబల్ హైపర్‌సోనిక్ టెక్నాలజీ పోటీలో చైనా అద్భుత విజయం.. ఇక అమెరికా పరిస్థితి?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

హైపర్‌సోనిక్ టెక్నాలజీలో చైనా మరింత పురోగతి సాధించింది. చైనా వాయవ్య ప్రాంతంలో ఫీటియన్ 2 హైపర్‌సోనిక్ వెహికిల్‌ను విజయవంతంగా పరీక్షించింది. వెహికిల్ ప్రయాణ సమయంలో ప్రధాన సవాల్‌గా భావించే వేర్వేరు ప్రొపల్షన్ మోడ్‌ల మధ్య మార్పులు చేయగల సామర్థ్యాన్ని చైనా నిరూపించుకుంది. హైపర్‌సోనిక్ సిస్టమ్‌ల అభివృద్ధిలో ఇది కీలకం. దీంతో అమెరికా వంటి దేశాలకు చైనా గట్టిపోటీని ఇస్తోంది.

నార్త్‌వెస్ట్రన్ పొలీటెక్నికల్ యూనివర్సిటీ, షాన్‌షీ ప్రావిన్స్ ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రొపల్షన్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఫీటియన్ 2ను అభివృద్ధి చేశారు. 2022 జూలైలో పరీక్షించిన ఫీటియన్ 1 ఆధారంగా దీన్ని రూపొందించారు. తాజా ప్రయోగం ద్వారా రాకెట్ బేస్డ్ కంబైన్‌డ్ సైకిల్ (ఆర్బీసీసీ) ఇంజిన్ టెక్నాలజీలో చైనా పురోగతి సాధించింది. వేగవంతమైన ప్రొపల్షన్, ఏరోడైనమిక్స్ పరిశోధనకు విలువైన డేటా లభించింది.

ఫీటియన్ 2లో ప్రధానమైనది ఆర్బీసీసీ ఇంజిన్. ఇది కెరోసిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమంతో పనిచేస్తుంది. సాంప్రదాయ హైపర్‌సోనిక్ వాహనాలు లిక్విడ్ ఆక్సిజన్ వంటి క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ఫీటియన్ 2 వాతావరణ ఆక్సిజన్‌ను ప్రయాణంలో వినియోగిస్తుంది. దీనివల్ల ఆన్‌బోర్డ్ ఆక్సిడైజర్ అవసరం తగ్గుతుంది, ఇంధన సామర్థ్యం మెరుగవుతుంది.

ఈ ప్రయోగంలో టేకాఫ్ సమయంలో రాకెట్‌లు త్రస్ట్ ఇచ్చే ఇజెక్టర్ మోడ్ నుంచి ఎయిర్ బ్రీదింగ్ ప్రొపల్షన్ ఉపయోగించే ర్యామ్జెట్ మోడ్‌కి సాఫీగా మారాయి. దీన్ని హైపర్‌సోనిక్ ప్రయాణానికి కీలకంగా పరిగణిస్తారు. ఇంజిన్ వేరియబుల్ జియోమెట్రీ ఇన్‌టేక్ సామర్థ్యం కూడా నిరూపితమైంది. ఇది వేగం, ఎత్తు మారుతున్నప్పుడు ఎయిర్‌ఫ్లోను నియంత్రిస్తుంది.

Also Read: బాబాయికి తోడుగా అబ్బాయి.. రంగంలోకి విరాట్ కోహ్లీ అన్న కొడుకు..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీలో ముందంజ
ఫీటియన్ 2 డిజైన్‌లో కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. పెద్ద టెయిల్ ఫిన్స్, కొత్త వింగ్స్ ను వాహనం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఇవి వేగంగా, అధిక ఎత్తులో ప్రయాణించే సమయంలో స్టెబిలిటీ, కంట్రోల్ మెరుగుపరుస్తాయి.

ఫీటియన్ 2 స్వయంచాలకంగా ప్రయాణించే సామర్థ్యం ఈ ప్రయోగంలో నిరూపితమైంది. వాహనం అవసరమైన మిషన్ డిమాండ్, పరిసర పరిస్థితుల ప్రకారం యాంగిల్ ఆఫ్ అటాక్ సర్దుబాటు చేసుకుంది. ఇది భవిష్యత్‌లో మిలిటరీ, సైన్స్ రంగాల్లో అన్మాన్డ్ హైపర్‌సోనిక్ సిస్టమ్‌లకు ఉపయోగపడుతుంది.

ఫీటియన్ 2లో కెరోసిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమాన్ని వినియోగించడం ప్రత్యేకత. కెరోసిన్‌కు లిక్విడ్ హైడ్రోజన్‌తో పోల్చితే తక్కువ ఎనర్జీ ఉన్నా, స్టోరేజ్, హ్యాండ్లింగ్ సులభం. దీని వల్ల వాహనం డిజైన్ సింపుల్‌గా మారుతుంది. హెవీ కూలింగ్ సిస్టమ్‌లు అవసరం ఉండదు.

ఫీటియన్ 1లో భాగంగా కెరోసిన్ హైపర్‌సోనిక్ ఇంజిన్‌లో పనిచేస్తుందని తేలింది. దీంతో ఫీటియన్ 2లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి వెయిట్ తగ్గించారు, త్రస్ట్ స్థిరంగా ఉంచారు. ఈ ఇంధన విధానం భవిష్యత్ హైపర్‌సోనిక్ వాహనాల నిర్మాణం, ఆపరేషన్‌ మీద ప్రభావం చూపనుంది.

ఫీటియన్ 2 ప్రయోగం ద్వారా చైనా హైపర్‌సోనిక్ టెక్నాలజీలో గ్లోబల్ పోటీలో ముందంజలో నిలిచింది. ప్రయాణ సమయంలో ప్రొపల్షన్ మార్పు, స్వయంచాలక వ్యవస్థలు, ఎయిర్‌ఫ్లో కంట్రోల్ వంటి వాటిని సాంకేతికంగా గొప్ప విజయంగా పరిగణిస్తారు. ఇది రక్షణ, పౌర రంగాల్లో ఫాస్ట్ ట్రాన్స్‌పోర్ట్, ర్యాపిడ్ రిస్పాన్స్ ప్లాట్‌ఫాంకు దోహదపడుతుంది.

​ఫీటియన్ 2 ప్రయోగం ద్వారా చైనా హైపర్‌సోనిక్ టెక్నాలజీలో గ్లోబల్ పోటీలో ముందంజలో నిలిచింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *