“మీకో దండం.. మీ పార్టీకో దండం” అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం.. బీజేపీకి రాజీనామా

Follow
X
Follow

బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనివ్వలేదని అన్నారు. నామినేషన్ వేయడానికి వెళ్తే తన మద్దతుదారులను బెదిరించారని తెలిపారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనివ్వలేదని అన్నారు.
రామచందర్‌రావుకు అధ్యక్ష పదవిపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని రాజాసింగ్ చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించానని తెలిపారు. తనకు సంబంధించిన ఈ విషయంలో లక్షలాది మంది కార్యకర్తలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీకి అధ్యక్షుడు ఎవరు కావలనేది ముందే డిసైడ్ అయి ఎన్నిక ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు.
తన మద్దతుదారులను బెదిరించారని తెలిపారు.