మీకో దండం..మీ పార్టీకో దండం..
Follow
– బీజేపీకి రాజాసింగ్ గుడ్‌బై
– నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు
– రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలుపకుండా బెదిరింపులు
– పార్టీ ఎదగడం ఇష్టంలేని వాళ్లే బీజేపీలో ఎక్కువ
– అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మీకో దండం…మీ పార్టీకో దండం…’ అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. కొంత కాలంగా ఆయన బీజేపీ రాష్ట్ర నేతలపై బాహాటంగానే విమర్శలు చేస్తున్న విషయం విదితమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచందర్‌రావును నియమించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ…రాజాసింగ్‌నే స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం స్వయంగా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉద్రిక్తత పార్టీ కార్యాలయంలో నెలకొంది. కేంద్ర మంత్రి, సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి శోభా కరంద్లాజే నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఇన్‌చార్జి అభరుపాటిల్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాను నామినేషన్ వేయబోతున్నట్టు రాజాసింగ్ తేల్చిచెప్పారు. ‘ఎవరైనా నామినేషన్ దాఖలు చేయొచ్చు. మీరూ దాఖలు చేయండి. ఎలాంటి అభ్యంతరం లేదు. నామినేషన్ దాఖలుకు పార్టీ నియమావళి ప్రకారం కనీసం పది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సంతకాలు తప్పనిసరి. సంతకాలు పెట్టించి నామినేషన్ దాఖలు చేయండి’ ‘ అని పాటిల్ స్పష్టం చేశారు. దీంతో రాజాసింగ్ తన అనుయాయులైన ముగ్గురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో సంతకాలు పెట్టించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు అక్కడే ఉండటంతో పార్టీ కార్యాలయంలోని మిగతా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులెవ్వరూ రాజాసింగ్ వైపు రాలేదు. దీంతో రాజాసింగ్ పార్టీ కార్యాలయం బయటకు వెళ్లిపోయారు. ‘పార్టీ తనకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా కౌన్సిల్ సభ్యులు సంతకం చేస్తే పదవులుండవని రాష్ట్ర నేతలు బెదిరించారు. అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు’ అంటూ ఆరోపించారు. ఆ తర్వాత రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
పార్టీలో గౌరవం లేదు…
పార్టీ ఎదగడం నేతలకు ఇష్టం లేదు : రాజాసింగ్
రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తే అడ్డుకున్నారనీ, తన నామినేషన్‌ను బలపరుస్తూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టకుండా బెదిరించారని ఆరోపించారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డికి లిఖితపూర్వకంగా లేఖ అందజేశానని తెలిపారు. తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయాలని కోరారని చెప్పారు. 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డాననీ, కానీ, పార్టీలో తనకు గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. తన కుటుంబం, తానూ ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్నా కూడా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదగడం కొందరు నేతలకు ఇష్టం లేదని విమర్శిం చారు. అలాంటి పార్టీలో ఎలా ఉండగలుగుతాను అని ప్రశ్నించారు. ‘మీ పార్టీకో దండం..మీకో దండం’ అని స్పష్టం చేశారు. తాను హిందూత్వ కోసం పనిచేస్తానని చెప్పారు.
రంగంలోకి బండి..అయినా నో
రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయనతో కేంద్ర మంత్రి బండి సంజరుకుమార్ భేటీ అయ్యారు. రాజీనామా అంశాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. దీనికి రాజాసింగ్ ససేమీరా అన్నట్టు తెలిసింది. ఇప్పటికే బీజేపీ రాజీనామా చేశాననీ, మళ్లీ ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. రాజాసింగ్ రాజీనామా తర్వాత జాతీయ నాయకత్వం అలర్ట్ అయ్యి జరిగిన పరిణామాలపై ఆరా తీసినట్టు తెలిసింది. రాష్ట్ర నాయకత్వం నుంచి వివరాలు తెలుసుకుని రాజాసింగ్ తీరుపై సీరియస్ అయినట్టు తెలిసింది. ఆయన రాజీనామాను ఆమోదించడమా? సస్పెండ్ చేయడమా? అని జాతీయ నాయకత్వం ఆలోచనలో పడింది. ఇప్పటికే గతంలో ఒకసారి రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే.
The post మీకో దండం..మీ పార్టీకో దండం.. appeared first on Navatelangana.
– బీజేపీకి రాజాసింగ్ గుడ్‌బై– నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు– రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలుపకుండా బెదిరింపులు– పార్టీ ఎదగడం ఇష్టంలేని వాళ్లే బీజేపీలో ఎక్కువ– అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‘మీకో దండం…మీ పార్టీకో దండం…’ అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. కొంత కాలంగా ఆయన బీజేపీ రాష్ట్ర నేతలపై బాహాటంగానే విమర్శలు చేస్తున్న విషయం విదితమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచందర్‌రావును నియమించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ…రాజాసింగ్‌నే స్వయంగా రంగంలోకి
The post మీకో దండం..మీ పార్టీకో దండం.. appeared first on Navatelangana.