మీకో దండం.. మీ పార్టీకో దండం

Follow
కిషన్‌రెడ్డి లేఖ అందజేత
కొత్త అధ్యక్షుడి ప్రకటనతో
అంతా నిరాశలో ఉన్నారు
నన్ను నామినేషన్ వేయకుండా
అడ్డుకున్నారు: రాజాసింగ్
రాజాసింగ్‌పై రాష్ట్ర కమిటీ
ఆగ్రహం ఆయన క్రమశిక్షణరాహిత్యం
పరాకాష్టకు చేరిందని ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్.రామచంద్రరావు పేరు ప్రచారంలోకి రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సోమవారం అందజేశారు. ఆ రాజీనామా లేఖలో తన రాజీనామాకు కారణాలు తెలియజేస్తూ రాజాసింగ్ బిజెపిలో లేరని, ఆ ఎమ్మెల్యేతో తమకు సంబంధం లేదని శాసనసభ స్పీకర్‌కు తెలియజేయాలని రాజాసింగ్ కిషన్‌రెడ్డికి సూచించారు. కాగా తన అనచురులతో అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చానని, అయితే తన అనుచరులను బెదిరించి తనకు మద్దతు ఇవ్వకుండా అడ్డుకుని నామినేషన్ దాఖలు చేయనివ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలామంది మౌనంగా ఉన్నంత మాత్రాన దానిని అంగీకారంగా భావించవద్దని పేర్కొన్నారు.
తాను నా ఒక్కడి గురించే మాట్లాడటం లేదని, మనల్ని నమ్మి, మన వెంట నిలిచిన లెక్కలేనంత మంది కార్యకర్తలు, ఓటర్ల తరఫున మాట్లాడుతున్నానని అన్నారు. వారంతా ఈ రోజు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. తనపై ఉన్న నమ్మకంతో పార్టీ వెంట నడిచిన కార్యకర్తలు, మద్దతుదారులు ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ గెలవకూడదని కోరుకునే వాళ్లు పార్టీలో ఎక్కువ మంది ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పదవుల నియామకాల్లో నా వాడు, నీ వాడు అంటూ నియమించుకుంటూ వెళితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాజాసింగ్ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించి సరైన వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన ఇకపై బీజేపీలో కొనసాగలేనని అందుకే రాజీనామా సమర్పించానని స్పష్టం చేశారు.
2019 నుంచి పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డానని, పార్టీ కోసమే తాను ఉగ్రవాదులకు టార్గెట్ గా మారానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాజీనామా చేసిన తర్వాత కేంద్రమంత్రి బండి సంజయ్ రాజాసింగ్‌ను నిర్ణయాన్ని మార్చుకోవాలని, పార్టీ కోసం అందరం కలిసిగట్టుగా పని చేద్దామని కోరారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని రాజాసింగ్ తేల్చి చెప్పారు.
కిషన్‌రెడ్డి లేఖ అందజేత కొత్త అధ్యక్షుడి ప్రకటనతో అంతా నిరాశలో ఉన్నారు నన్ను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు: రాజాసింగ్ రాజాసింగ్‌పై రాష్ట్ర కమిటీ ఆగ్రహం ఆయన క్రమశిక్షణరాహిత్యం పరాకాష్టకు చేరిందని ప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్.రామచంద్రరావు పేరు ప్రచారంలోకి రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను