మీరు వాటర్ క్యాన్‌ వాటర్ తాగుతున్నారా..? మరి దాని క్లీనింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
మీరు వాటర్ క్యాన్‌ వాటర్ తాగుతున్నారా..? మరి దాని క్లీనింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..?

వాటర్ క్యాన్‌ లను కేవలం బయట నుంచి కడగడమే సరిపోదు. వాస్తవానికి వాటి లోపల మట్టి, చెత్త, ఆల్గే పేరుకుపోయి ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లోపలి గోడలు పసుపు రంగులోకి మారినట్టు కనిపిస్తుంది. ఇది పొడిగా మారిన ఫంగస్ లేదా ఆల్గే సంకేతం. ఈ నీటిని మనం తాగితే లేదా వంటలో వాడితే శరీరానికి హాని చేయవచ్చు. కాబట్టి కనీసం ప్రతి రెండు నెలలకోసారి లోతుగా శుభ్రం చేయడం అవసరం.

శుభ్రం చేయడానికి కావాల్సినవి

  • సాధారణ ఉప్పు లేదా రాతి ఉప్పు
  • బేకింగ్ సోడా
  • డిష్ వాషింగ్ జెల్
  • నిమ్మకాయ
  • ఒక గ్లాసు నీరు
  • స్క్రబ్బింగ్ బ్రష్

ఎలా శుభ్రం చేయాలి..?

వాటర్ క్యాన్‌ ను శుభ్రం చేయడానికి ముందు.. అందులోని నీటిని వృథా చేయకుండా మొక్కలకు లేదా ఇతర అవసరాలకు ఉపయోగించండి. ఆ తర్వాత ఖాళీ క్యాన్‌ లో 3 టీస్పూన్ల ఉప్పు వేసి దాన్ని బాగా కలిపి క్యాన్ అంతటా తిప్పండి. ఇది ఆల్గేను విడదీయడానికి సహాయపడుతుంది. తర్వాత రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి మళ్లీ బాగా కలపండి. ఇది క్యాన్‌లోని చెడు వాసనను తొలగించడంలో కీలకం.

తరువాత మూడు టీస్పూన్ల డిష్ వాషింగ్ జెల్ చేర్చి, రెండు గ్లాసుల నీటితో కలిపి 10 నిమిషాలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వాటర్ క్యాన్ మూత పెట్టి బాగా కదిలించండి. సుమారు 10 నిమిషాలు ఇలా తిప్పడం వల్ల లోపల పేరుకుపోయిన మురికి వదులుతుంది. బయటి గోడలను స్క్రబ్బర్‌ తో బాగా రుద్ది శుభ్రపరచండి.

నురుగు నీటిని పూర్తిగా పారబోసి క్యాన్‌ ను నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రమైన నీటితో బాగా కడగండి. డిష్ వాషింగ్ జెల్ వాసన పూర్తిగా పోయేలా చూసుకోండి. అప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండి క్యాన్‌ లో వేసి ఒక గ్లాసు నీరు కలిపి మళ్లీ కడగండి. ఇది మిగిలిన వాసనను పూర్తిగా తొలగిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ వాటర్ క్యాన్ కొత్తదిలా మెరిసిపోతుంది. ఎటువంటి చెడు వాసన ఉండదు.

​ప్రతిరోజూ మనం వాడే వాటర్ క్యాన్‌ లు కనిపించడానికి శుభ్రంగా ఉన్నట్లు అనిపించినా.. వాటి లోపల ఎంత మురికి పేరుకుపోయిందో మనం ఊహించలేం. ముఖ్యంగా 20 లీటర్ల వాటర్ క్యాన్‌ లు కాలక్రమేణా ఆల్గే (ఆకుపచ్చగా పేరుకునే జీవులు) చెడు వాసన కారణంగా ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. అయితే ఈ వాటర్ క్యాన్‌ లను మార్చకుండా.. ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులతో వాటిని కొత్తవాటిలా శుభ్రం చేసుకోవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *