మూడేండ్లుగా ఫ్లాట్‌లో బందీ.. స్వీయ నిర్బంధం విధించుకున్న టెకీ!

Follow

ముంబై, జూన్ 30 : తల్లిదండ్రులు, సోదరుడు చనిపోవటంతో అయిన మానసిక గాయం ఓ టెకీ జీవితాన్ని నిరాశ నిస్పృహల్లోకి నెట్టింది. నవీ ముంబైకి చెందిన మాజీ కంప్యూటర్ ప్రోగ్రామర్, అనూప్‌కుమార్ నాయర్ (55).. ఫ్లాట్‌లో స్వీయ నిర్బంధం విధించుకున్నాడు. గత మూడేండ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరి జీవితం గడుపుతున్నాడు.
సెక్టార్-24 జూనాగర్‌లోని అతడు నివసిస్తున్న ఘార్కూల్ అపార్ట్‌మెంట్ వాసులు, ఎన్జీవో సంస్థ ‘సీల్’ కార్యకర్తలు అతడ్ని కాపాడారు. పన్వేల్‌లోని సీల్ ఆశ్రమానికి తరలించి మానసిక వైద్య చికిత్సను అందిస్తున్నారు. అతడి ఫ్లాట్ ఒక చెత్తకుప్పలా తయారైందని, అత్యంత దయనీయ పరిస్థితుల మధ్య అతడు జీవిస్తున్న సంగతి ఫ్లాట్‌లో అడుగుపెట్టిన వెంటనే కనిపించిందని సీల్ కార్యకర్తలు చెప్పారు. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆహారాన్ని తెప్పించుకునేవాడని ఎన్జీవో సంస్థ తెలిపింది.
తల్లిదండ్రులు, సోదరుడు చనిపోవటంతో అయిన మానసిక గాయం ఓ టెకీ జీవితాన్ని నిరాశ నిస్పృహల్లోకి నెట్టింది. నవీ ముంబైకి చెందిన మాజీ కంప్యూటర్ ప్రోగ్రామర్, అనూప్‌కుమార్ నాయర్ (55).. ఫ్లాట్‌లో స్వీయ నిర్బంధం విధించుకున్నాడు. గత మూడేండ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరి జీవితం గడుపుతున్నాడు.