మెదడును ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే..! వీటిని తప్పకుండా తీసుకోండి.. మిస్సవ్వొద్దు..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
మెదడును ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే..! వీటిని తప్పకుండా తీసుకోండి.. మిస్సవ్వొద్దు..!

మెదడుకు సహజంగా శక్తిని ఇవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైన జీవనశైలి అలవాట్లు.. సరైన ఆహార పద్ధతులు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెదడులో ఎసిటైల్కోలిన్ అనే ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌ మిటర్ ఉంటుంది. ఇది నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ శరీరం కదలికల నుంచి జ్ఞాపకశక్తి వరకు ఎన్నో కీలక పనుల్లో పాల్గొంటుంది. ఈ రసాయనం స్థాయి తగ్గితే జ్ఞాపకశక్తి సమస్యలు, కండరాల బలహీనత, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా అల్జీమర్స్ వంటి న్యూరో సమస్యలతో ఎసిటైల్కోలిన్ స్థాయిలు తగ్గుతాయి. అందుకే ఈ స్థాయిలను సహజంగా పెంచడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరచవచ్చు. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కొన్ని జీవనశైలి మార్పులు పాటించడం చాలా అవసరం. ఇందులో ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర తీసుకోవడం ద్వారా మెదడుకు తగిన విశ్రాంతి లభిస్తుంది. ఇది ఎసిటైల్కోలిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

మెదడుకు కసరత్తు ఇవ్వడం కూడా ముఖ్యమే. చదరంగం, పజిల్స్, సంగీతం నేర్చుకోవడం, కొత్త భాషలు నేర్చుకోవడం వంటి మేధో కృషి వలన మెదడులో కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. ఇది న్యూరోట్రాన్స్‌ మిటర్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే ధ్యానం, యోగా, లోతైన శ్వాసలు వంటి విశ్రాంతి పద్ధతుల ద్వారా ఒత్తిడిని నియంత్రించడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గడం వల్ల మెదడు మెరుగ్గా పనిచేస్తుంది.

ఎసిటైల్కోలిన్ స్థాయిలను పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషకం అధికంగా ఉంటుంది. ఇది మెదడుకు నిత్యం అవసరమైన పోషకాన్ని అందిస్తుంది. బాదం, అవిసె విత్తనాలు వంటి గింజలు న్యూరోట్రాన్స్‌ మిటర్‌ ను బలోపేతం చేస్తాయి. సాల్మన్, మాకెరెల్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడును సురక్షితంగా ఉంచుతాయి. చివరగా పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ K ఉంటాయి ఇవి మెదడు కణాలను వాపు నుంచి రక్షిస్తాయి.

శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగానే మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సరైన ఆహారం, జీవనశైలి మార్పులు కీలక పాత్ర పోషిస్తాయి. మీరు జ్ఞాపకశక్తిని బలపరచాలనుకుంటే.. నిద్ర, ఆహారం, వ్యాయామం వంటి చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టండి.

​ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ లో ఉద్యోగ భారం, వ్యక్తిగత బాధ్యతలు పెరిగిపోవడం వల్ల ఎంతోమంది యువత, మధ్య వయస్కులు.. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపం, మానసిక అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో.. మెదడు ఆరోగ్యానికీ అంతే ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం మన మొత్తం శ్రేయస్సుకు కీలకం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *