మెయిలింగ్‌లో ఏఐ దూకుడు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Instant Messaging Services

ఎన్ని రకాలుగా ఇన్‌స్టాంట్‌ మెసేజ్‌ సర్వీసులు వచ్చినా.. ఇ-మెయిల్స్‌కు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడి నుంచి కార్పొరేట్‌ సంస్థల సీఈవో వరకు మెయిల్‌ సర్వీసుల్నే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోఇ-మెయిల్స్‌ కూడా ‘ఏఐ’  సపోర్ట్‌తో ముస్తాబవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్స్‌, గ్యాడ్జెట్స్‌ నుంచి ఇ-మెయిల్స్‌కి చేరిన ఏఐ తనదైన ప్రభావాన్ని చూపుతున్నది. ఇదే విషయంపై గూగుల్‌ సంస్థకు చెందిన డీప్‌మైండ్‌ సీఈవో డెమిస్‌ హస్సాబిస్‌ ఇటీవల జీమెయిల్‌ కోసం ఒక కొత్త ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఇది నెక్ట్స్‌ జనరేషన్‌ ఇ-మెయిల్‌ వ్యవస్థ అవుతుందని అభివర్ణించారు.

డీప్‌మైండ్‌ తీసుకొస్తున్న ఈ నయా ఏఐ టూల్‌ లక్ష్యం మన ఊహకు అందనంతగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఇ-మెయిల్స్‌ను రీడ్‌ చేయడం, అర్థం చేసుకోవడం, మెయిల్‌ రైటింగ్‌ ైస్టెల్‌ను అనుకరించడం, మన తరఫున మెయిల్స్‌కు ఆటోమేటిక్‌గా రిైప్లె ఇవ్వడం ఇవన్నీ చేస్తుందీ ఏఐ టూల్‌. దీని పేరు ఏజీఐ. దీనిని హ్యూమన్‌ లెవల్‌ రీజనింగ్‌ కలిగిన ఏఐ సిస్టమ్‌గా మేకర్స్‌ అభివర్ణిస్తున్నారు. మరో ఐదు నుంచి పదేండ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఏఐ ఫీచర్స్‌ కేవలం జీమెయిల్‌తోనే ఆగడం లేదు. ఇతర మెయిల్‌ ప్రొవైడర్స్‌ కూడా ఏఐ ద్వారా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

జీమెయిల్‌లో ‘ఏఐ’

క్రోమ్‌ వాడుతున్నారంటే.. జీమెయిల్‌ ఉపయోగిస్తున్నట్టే! ఎందుకంటే.. లైట్‌ మెమరీతో అన్ని రకాల పీసీ, ఫోన్లలో క్రోమ్‌ బ్రౌజర్‌కి ఉన్న ఆదరణ అలాంటిది. దీంతోపాటు గూగుల్‌ అందించే జీమెయిల్‌, జీడ్రైవ్‌కి అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు నెటిజన్లు. అందుకే గూగుల్‌ జీమెయిల్‌ కోసం ‘ఏఐ’ డెవలప్‌మెంట్‌ని పరిచయం చేయనుంది. ఈ టూల్‌ మీ రైటింగ్‌ ైస్టెల్‌ని అనుకరిస్తూ మీకు వచ్చిన మెయిల్‌కు రిైప్లె ఇస్తుంది. ఇన్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ కంటెంట్‌ని రోజూ మానిటర్‌ చేస్తుంది. మొత్తం డేటాను విశ్లేషించి, మీ రైటింగ్‌ ైస్టెల్‌ని పట్టేస్తుందన్నమాట! ఎప్పటికప్పుడు మీకు వచ్చే మెయిల్స్‌కు స్మార్ట్‌ రిైప్లెలు సూచిస్తుంది. దీంతో మీ మెయిల్స్‌ను మేనేజ్‌ చేయడం సులభతరం అవుతుంది. ఇన్‌బాక్స్‌కి చేరే మెయిల్స్‌లో కంటెంట్‌ ఆధారంగా వాటి ప్రాధాన్యాన్ని సెట్‌ చేస్తుంది. దీంతో యూజర్లు ముఖ్యమైన మెయిల్స్‌కి వెంటనే రెస్పాండ్‌ అయ్యే వీలుంటుంది. ఈ క్రమంలో డేటా యూసేజ్‌ గణనీయంగా తగ్గుతుంది. ఇక గూగుల్‌ ఇప్పటికే హెల్ప్‌ మీ రైట్‌ (Help me write), స్మార్ట్‌ కంపోజ్‌ (Smart Compose), స్మార్ట్‌ రిైప్లె (Smart Reply).. లాంటి ఏఐ సేవలను రోల్‌ అవుట్‌ చేసింది. ఇప్పుడు ఈ నెక్ట్స్‌ జనరేషన్‌ టూల్‌తో మరో అడుగు ముందుకు వేసిందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

01

అవుట్‌లుక్‌లో అడ్వాన్స్‌డ్‌ ఏఐ

మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ కూడాఏఐ రేస్‌లో వెనక్కి తగ్గడం లేదు. గత ఏడాదే Microsoft 365 Copilotను అవుట్‌లుక్‌లో ఇంటిగ్రేట్‌ చేసింది. అంతేకాదు.. రెగ్యులర్‌ అప్‌డేట్స్‌తో అవుట్‌లుక్‌ లుక్‌ మార్చేస్తున్నది. ముఖ్యంగా ఈ Copilot ఇ-మెయిల్స్‌ను అనలైజ్‌ చేస్తుంది. ‘ఏఐ రిైప్లె జనరేటర్‌’తో మీ రిైప్లెలు డ్రాఫ్ట్‌ చేయడమే కాకుండా, మీ షెడ్యూల్‌ ఆధారంగా మీటింగ్స్‌ని ఆటోమేటిక్‌గా బుక్‌ చేస్తుంది. ఉదాహరణకు, మీకు ఈ వారంలో ఒక గంట ఖాళీ స్లాట్‌ ఉందనుకోండి, ‘ఆ టైమ్‌లో మీటింగ్‌ సెట్‌ చేయాలా?’ అంటూ Copilot సజెస్ట్‌ చేస్తుంది. మీ అనుమతితో మీటింగ్స్‌ స్లాట్స్‌ని బ్లాక్‌ చేస్తుంది. అంతేకాదు.. ఇన్‌బాక్స్‌ క్లీనప్‌ ఫీచర్‌తో అనవసరమైన ఇ-మెయిల్స్‌ని డిలిట్‌ చేస్తుంది. ప్రాధాన్యం ఆధారంగా మెసేజ్‌లను సార్ట్‌ చేస్తుంది. Wordeep రాసిన మెయిల్స్‌ని రియల్‌ టైమ్‌లో చెక్‌ చేస్తుంది. ఏవైనా మిస్టేక్స్‌ ఉంటే అప్పటికప్పుడే మార్పు చేసి చూపిస్తుంది. కార్పొరేట్‌ ప్రొఫెషనల్స్‌కి టైమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ ఏఐ ఫీచర్స్‌ బాగా హెల్ప్‌ అవుతాయి. ఇంకా చెప్పాలంటే.. ఇతర థర్డ్‌ పార్టీ ఏఐ సేవల్ని కూడా మెయిల్‌ సర్వీసుల్లో ఇంటిగ్రేట్‌ చేసుకునే వీలుంది.

యాహూ.. అనేలా!

నేటికీ యాహూ సర్వీసులు వాడే యూజర్లు అనేకం. దీంతో యాహూ కూడా ఏఐ సమర్థతతో పర్సనలైజ్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు సిద్ధం అవుతున్నది. యాహూలో ఏఐ ఆధారిత ఫీచర్‌ని రోల్‌ అవుట్‌ చేసింది. దీంతో ఇ-మెయిల్‌ హిస్టరీని విశ్లేషించ వచ్చు. పర్సనలైజ్డ్‌ రిైప్లె సూచనలు పొందొచ్చు. ‘ఇ-మెయిల్‌ సమ్మరీస్‌’ ఫీచర్‌తో మొత్తం మెయిల్‌ని చదవాల్సిన అవసరం లేదు. ఏఐ మీ కోసం ముఖ్యమైన సమాచారాన్ని సంక్షిప్తం చేసి ఇస్తుంది. దీంతో ఈవెంట్స్‌, బిల్లింగ్‌ వివరాలు, వెరిఫికేషన్‌ కోడ్స్‌.. లాంటి ముఖ్యమైన విషయాల్ని స్కిప్‌ అయ్యే చాన్స్‌ ఉండదు. ‘ఏఐ కంపోజ్‌’తో క్షణాల్లో మెయిల్‌ని కంపోజ్‌ చేయొచ్చు. పలు రకాల మోడ్స్‌ (Improve, Concise, Friendly, Professional) మెయిల్స్‌ని రాసేయొచ్చు. అలాగే, ఈ ఏఐ టూల్‌ స్పామ్‌ మెయిల్స్‌ని మరింత ఎఫెక్టివ్‌గా ఫిల్టర్‌ చేస్తుంది. సోషల్‌ మీడియా ప్రమోషన్స్‌ని, న్యూస్‌లెటర్స్‌ని సపరేట్‌ ఫోల్డర్స్‌లోకి మూవ్‌ చేస్తుంది. దీంతో ముఖ్యమైన మెయిల్స్‌పై మీరు ఫోకస్‌ చేయొచ్చన్నమాట!

ఇంకా ఎన్నెన్నో..

ఏఐ ఇ-మెయిల్‌ సిస్టమ్స్‌లో ఇకపై ఊహించని ఫీచర్స్‌ని యూజర్లు చూడబోతున్నారు. జీమెయిల్‌, అవుట్‌లుక్‌, యాహూ.. లాంటి మరిన్ని ప్రొవైడర్లు ఏఐ ద్వారా ఇ-మెయిల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లనున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మీ మెయిల్స్‌ను మేనేజ్‌ చేయడమే కాదు, మీ లైఫ్‌ైస్టెల్‌కు తగ్గట్టు రికమెండేషన్స్‌ ఇవ్వడం, మీ అవసరాలను పసిగట్టడం ఇవన్నీ చేయనుంది. ఉదాహరణకు మీరు ఒక మెయిల్‌లో ‘మీటింగ్‌ షెడ్యూల్‌ చేద్దాం’ అని రాస్తే… ఏఐ మీ క్యాలెండర్‌ని చెక్‌ చేసి, స్లాట్‌ సజెస్ట్‌ చేస్తుంది. అక్కడితో ఆగకుండా మీటింగ్‌ లింక్‌ని జనరేట్‌ చేసి, డ్రాఫ్ట్‌ కూడా సిద్ధం చేస్తుంది. ఈ ఏఐ టూల్స్‌ స్టూడెంట్స్‌, ప్రొఫెషనల్స్‌, హోమ్‌మేకర్స్‌.. ఇలా అందరి అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తాయి అనడంలో సందేహం లేదు!

​ఎన్ని రకాలుగా ఇన్‌స్టాంట్‌ మెసేజ్‌ సర్వీసులు వచ్చినా.. ఇ-మెయిల్స్‌కు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడి నుంచి కార్పొరేట్‌ సంస్థల సీఈవో వరకు మెయిల్‌ సర్వీసుల్నే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోఇ-మెయిల్స్‌ కూడా ‘ఏఐ’  సపోర్ట్‌తో ముస్తాబవుతున్నాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *