మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Government Hospitals

పటాన్‌చెరు, జూన్‌ 30: గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. ధృవ, ప్రణాయ్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీచేశారు. చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ప్రభు త్వం ఆదుకుంటుందన్నారు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందన్నారు. పరిశ్రమలో 12 మంది కార్మికులు చనిపోయారని, 34 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

దవాఖానకు క్షతగాత్రుల తరలింపు

పాశామైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే క్షతగాత్రులను దవాఖానకు తరలించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ప్రమాదంలో 12 మంది కార్మికులు మృతిచెందారని, మరికొంత మంది కార్మికులు ఐయూసీలో చికిత్స పొందుతున్నారన్నారు.

కార్మికులకు 70 నుంచి 80 శాతం గాయాలయ్యాయన్నారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు. శిథిలాలు తొలిగించిన తర్వాత పూర్తివివరాలు తెలుస్తాయన్నారు.ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. సమగ్ర విచారణ చేసేందుకు కార్మికశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

​గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. ధృవ, ప్రణాయ్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీచేశారు. చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *