మొదటి రోజు నుంచే టార్గెట్‌.. పథకం ప్రకారమే కోల్‌కతా గ్యాంగ్‌రేప్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Senior Police

కోల్‌కతా : కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై సిట్‌ దర్యాప్తు కీలక విషయాల్ని వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు బాధిత మహిళా స్టూడెంట్‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని, కాలేజీలో అడ్మిషన్‌ పొందిన మొదటి రోజు నుంచే ఆమెను ప్రధాన నిందితుడు టార్గెట్‌ చేశాడని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు.

‘అరెస్టయిన నలుగురిలో మోనోజిత్‌ మిశ్రా, ప్రతిమ్‌ ముఖర్జీ, జైద్‌ అహ్మద్‌లు.. పథకం ప్రకారమే కుట్రకు పాల్పడ్డారు. కళాశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన చరిత్ర వారికుంది. నాలుగో నిందితుడు కాలేజీ సెక్యూరిటీ గార్డ్‌’ అని చెప్పారు. నిందితులు తమ చర్యలను మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేసి, ఆ దృశ్యాలను ఉపయోగించి బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేసినట్టు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల మొబైల్‌ వీడియోల కోసం వెదుకుతున్నామని పోలీస్‌ అధికారి చెప్పారు.

సహ విద్యార్థిని పేరు తెరపైకి!

గ్యాంగ్‌రేప్‌ జరిగిన రోజు ఎర్ర కుర్తా ధరించిన బాధితురాలి సహ విద్యార్థిని ఉదయం నుంచి రాత్రి 8.30 గంటల వరకు కాలేజీ యూనియన్‌ రూమ్‌లో గడిపిందని సెక్యూరిటీ గార్డ్‌ తెలిపాడు. దీంతో ఆమెను ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు.

​కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై సిట్‌ దర్యాప్తు కీలక విషయాల్ని వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు బాధిత మహిళా స్టూడెంట్‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని, కాలేజీలో అడ్మిషన్‌ పొందిన మొదటి రోజు నుంచే ఆమెను ప్రధాన నిందితుడు టార్గెట్‌ చేశాడని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *