మోకరిల్లితే ఎన్ని లాభాలో!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kneeling, Knees, Ankles

దేవుడి ముందు మోకరిల్లడం ఆస్తికులు అప్రయత్నంగా చేసేపనే. భగవంతుణ్ని ప్రార్థించడం, ఆయన ముందు అణకువగా ఉండటం, భక్తిని చాటుకోవడం లాంటివి మోకరిల్లే చేస్తుంటారు. అయితే, దీంతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మోకరిల్లడం మోకాళ్లు, చీలమండలు (యాంకిల్స్‌), తొడ భాగాల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. శరీరాన్ని సరైన భంగిమలో ఉంచడానికి దన్నుగా ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది.

మోకరిల్లే ప్రక్రియలో పొట్ట కిందిభాగం, కటిభాగంలోని కండరాలుఉపయోగంలోకి వస్తాయి. అలా కాలి కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి స్థిరత్వం చేకూరుతుంది.

మోకరిల్లడం వల్ల ఒక రకమైన విశ్రాంతి దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కాలక్రమంలో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాళ్లు, పాదాలకు రక్త సరఫరా మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కాళ్లు, పాదాల్లో వాపు తగ్గడంలో సాయపడుతుంది.

తల కిందికి వంచి మోకరిల్లడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి అండగా ఉంటుంది.

మోకాళ్లు, కాళ్లు, వెన్ను దిగువ భాగం సాగదీస్తారు కాబట్టి, విశ్రాంతిగా అనిపిస్తుంది. ఆందోళన తగ్గుతుంది.

మోకరిల్లడం, ముందుకు వంగి నమస్కరించడం వల్ల వెన్ను దిగువ భాగంలో నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

కొన్ని రకాలైన మోకరిల్లే భంగిమలు ఆర్థరైటిస్‌ లాంటి వాటి నుంచి తలెత్తే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. కీళ్ల ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి హామీ దొరుకుతుంది.

భగవంతుడి ముందు మోకరిల్లడం అహంభావాన్ని తగ్గిస్తుంది. మెదడుకు పదును పెడుతుంది. శరీరాన్ని, ఆత్మను అనుసంధానం చేస్తుంది. అలా ఏకాగ్రతను, ఆధ్యాత్మిక తీవ్రతను పెంచుతుంది.

​దేవుడి ముందు మోకరిల్లడం ఆస్తికులు అప్రయత్నంగా చేసేపనే. భగవంతుణ్ని ప్రార్థించడం, ఆయన ముందు అణకువగా ఉండటం, భక్తిని చాటుకోవడం లాంటివి మోకరిల్లే చేస్తుంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *