యాపిల్ కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు.. రోజు 4 ఆకులు తింటే చాలు..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
యాపిల్ కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు.. రోజు 4 ఆకులు తింటే చాలు..!

కర్పూరవల్లి ఆకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు కలిగి ఉంటుంది. ఈ ఆకులను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి అద్భుతమైన లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కర్పూరవల్లి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ కంటే అధిక యాంటీఆక్సిడెంట్లు

ఈ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ల మోతాదు యాపిల్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే రోజుకు నాలుగు కర్పూరవల్లి ఆకులు తినడం ఒక యాపిల్ తినడంతో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

జీవక్రియ మెరుగుపరచడం

ఈ ఆకులు శరీరంలోని జీవక్రియను ప్రేరేపించి.. శక్తిని పెంచుతాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.

పొడి దగ్గు నివారణకు

నాలుగు కర్పూరవల్లి ఆకులను కొంచెం వేడి చేసి వాటి రసం తీసి తేనె కలిపి తీసుకోవడం వల్ల పొడి దగ్గుకు ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో 48 రోజులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు తేనె మినహాయించాలి.

గ్యాస్ సమస్య

రాత్రి పడుకునే ముందు రెండు ఆకులను నమలడం.. తర్వాత వేడి నీరు త్రాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.

పీరియడ్స్ నొప్పికి ఉపశమనం

పీరియడ్స్ నొప్పితో బాధపడే మహిళలు ఉదయం 6 గంటలకు ఈ ఆకులను నమలితే నొప్పి తగ్గుతుంది.

ఊబకాయం సమస్య

ఊబకాయం సమస్య ఉన్నవారు రోజుకు మూడు సార్లు ఈ ఆకులను తింటే శరీరంలోని.. ముఖ్యంగా బొడ్డులో ఉండే కొవ్వు కరుగుతుంది.

ఎలా వాడాలి..?

కర్పూరవల్లి ఆకులు సాధారణంగా ఆకుపచ్చ రంగులో, ప్రత్యేకమైన వాసనతో ఉంటాయి. ఇవి రుచికరమైనవి కాకపోయినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను నేరుగా నమలవచ్చు లేదా కొంచెం వేడి చేసి ఉపయోగించవచ్చు. సువాసనతో కూడిన ఈ ఆకులు జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు కూడా సహాయపడతాయి.

జాగ్రత్తలు

ఈ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల సాధారణంగా ఎటువంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవు. అయినప్పటికీ.. మీరు ఏవైనా ప్రస్తుత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వైద్యుడి సలహాతోనే వాడటం ఉత్తమం. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ముందుగా వైద్య సలహా తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

​మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. చాలా మంది ఆరోగ్యానికి మంచిదని యాపిల్ వంటి పండ్లను తింటారు. అయితే కొందరికి ప్రత్యేక ఔషధ గుణాలున్న ఆకుల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటి అద్భుతమైన మొక్కల్లో కర్పూరవల్లి (పనికూర/వాము ఆకు) ఒకటి. ఇది సాధారణంగా కనిపించేదే అయినా.. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా గొప్పవి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *