యువతరం లక్ష్యంగా థాంక్యూ డియర్..

Follow

ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థాం క్యూ డియర్’. తోట శ్రీకాంత్‌కుమార్ దర్శకుడు. పప్పు బాలాజీరెడ్డి నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కాను ంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ టీజర్‌ని లాంచ్ చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అంది ంచారు.
వి.వి.వినాయక్ చేతులమీదుగా టీజర్ లాంచ్ జరగడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర విజయం పట్ల వారు నమ్మకం వెలిబుచ్చారు. వీరశంకర్, నాగమహేష్, రవిప్రకాశ్, ఛత్రపతి శేఖర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎల్.కె.రెడ్డి, సంగీతం: సుభాష్ ఆనంద్, నిర్మాణం: మహాలక్ష్మీ ప్రొడక్షన్స్.
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థాం క్యూ డియర్’. తోట శ్రీకాంత్‌కుమార్ దర్శకుడు. పప్పు బాలాజీరెడ్డి నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కాను ంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.