యూపీఎస్‌ ఉద్యోగులకు రిటైర్మెంట్‌, డెత్‌ గ్రాట్యుటీ బెనిఫిట్స్‌​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Ups Employees
  • పాత పింఛను పథకం ప్రకారమే వర్తింపు
  • కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడి

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త చెప్పారు. యూనిఫైడ్‌ పింఛను పథకం (యూపీఎస్‌) పరిధిలో ఉన్నవారికి పాత పింఛను పథకం (ఓపీఎస్‌) ప్రకారం లభించే పదవీ విరమణ, మరణానంతర పరిహార ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న డిమాండ్‌ను పరిష్కరించినట్లు తెలిపారు. దీనివల్ల పదవీ విరమణ అనంతర ప్రయోజనాల్లో సమానత్వం వస్తుందన్నారు. ఈ కొత్త నిబంధన ఆ విషయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పేమెంట్‌ ఆఫ్‌ గ్రాట్యుటీ అండర్‌ నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌) రూల్స్‌, 2021 ప్రకారం లభించే రిటైర్‌మెంట్‌, డెత్‌ గ్రాట్యుయిటీలకు యూపీఎస్‌ పరిధిలోని కేంద్ర ప్రభుత్వోద్యుగులు అర్హులవుతారని వివరించారు. పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) బుధవారం ఓ ఉత్తర్వును జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వోద్యోగి సర్వీసులో ఉండగా లేదా ఇన్‌వాలిడేషన్‌ లేదా డిజెబిలిటీ కారణంగా ప్రభుత్వ సర్వీసు నుంచి డిశ్చార్జ్‌ అయినా, పాత పింఛను పథకం ప్రకారం బెనిఫిట్స్‌ పొందేందుకు ఆప్షన్స్‌ను ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. యూపీఎస్‌ పరిధిలోని కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఇది వర్తిస్తుంది.

​కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త చెప్పారు. యూనిఫైడ్‌ పింఛను పథకం (యూపీఎస్‌) పరిధిలో ఉన్నవారికి పాత పింఛను పథకం (ఓపీఎస్‌) ప్రకారం లభించే పదవీ విరమణ, మరణానంతర పరిహార ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న డిమాండ్‌ను పరిష్కరించినట్లు తెలిపారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *