యూరియా గోసపై ఆరా.. శెట్‌పల్లి సొసైటీలో విచారణ

Follow
X
Follow

మోర్తాడ్, జూన్ 30: మండలంలోని శెట్‌పల్లి సొసైటీ పరిధిలో యూరియా కొరత, రైతుల కష్టాలతోపాటు యూరియా పంపిణీలో చోటుచేసుకుంటున్న లొసుగులపై నమస్తే తెలంగాణ దినపత్రిక లో ‘యూరియా గోస’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు.
సహకార శాఖ మోర్తాడ్ క్లస్టర్ సీనియన్ ఇన్‌స్పెక్టర్ మంజుల శెట్‌పల్లి సొసైటీని సోమవారం సందర్శించారు. ఎంత మంది రైతులకు ఎన్ని బస్తాల యూరియా పంపిణీ చేశారని సిబ్బందిని అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. తొర్తిలోనూ యూరియా పంపిణీ విషయంలో చోటుచేసుకున్న గొడవపై ఆరా తీశారు.
మండలంలోని శెట్‌పల్లి సొసైటీ పరిధిలో యూరియా కొరత, రైతుల కష్టాలతోపాటు యూరియా పంపిణీలో చోటుచేసుకుంటున్న లొసుగులపై నమస్తే తెలంగాణ దినపత్రిక లో ‘యూరియా గోస’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది.