రాంకోను ముట్టడిరచిన సీపీఐ
Follow
. ప్రధాన గేటు వద్ద బైఠాయింపు… ఉద్రిక్తత
. బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
విశాలాంధ్ర – కొలిమిగుండ్ల : బాధిత రైతులకు రాంకో సిమెంట్ యాజమాన్యం న్యాయం చేయాలని సీపీఐ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వందలాదిగా తరలివచ్చిన సీపీఐ, ఏఐకేఎస్, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తల ముట్టడితో రాంకో ప్రధాన గేటు పరిసర ప్రాంతం సోమవారం దద్దరిల్లింది. ఎర్రజెండాలు చేతబట్టి రాంకో ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, ఏఐకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కరరావు, మండల కార్యదర్శి పుల్లయ్య, అనంతపురం జిల్లా తాడపత్రి సీపీఐ నాయకులు చిరంజీవులు, బేతంచెర్ల మండల కార్యదర్శి భార్గవ్, ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులు బాలకృష్ణ, నాయకులు సుబ్బారెడ్డి, కుళ్లాయిస్వామి, సూర్యనారాయణ, మహేశ్ తదితరుల అధ్వర్యంలో భారీగా కార్యకర్తలు, రైతులు, ప్రజలు తరలివచ్చారు. రాంకో సమీపంలోని రైతు సంఘం నాయకుడు పుల్లయ్య చీని తోట వద్దకు నాయకులందరూ తరలివచ్చారు. అక్కడి నుండి ర్యాలీగా బయల్దేరి రాంకో యాజమాన్యం రైతులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రెండు కిలోమీటర్లు నడిచి రాంకో ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యలో రాంకో సెక్యూరిటీ, పోలీసులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాధిత రైతులకు న్యాయం చేయడంలో రాంకో యజమాన్యం విఫలమైందన్నారు. ఇప్పటికే సీపీఐ అధ్వర్యంలో రైతుసంఘం నాయకులు పలు దఫాలుగా రాంకో ప్రతినిధులు, అధికారులతో చర్చించినప్పటికీ న్యాయం చేయడం లేదని విమర్శించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఫ్యాక్టరీ వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు భూములు ఇచ్చారని, కానీ రాంకో యాజమాన్యం స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించకుండా మోసం చేస్తున్నదన్నారు. రాంకో చుట్టుపక్కల పంటలు సాగుచేస్తున్న రైతన్నలు కాలుష్యంతో ఐదేళ్లుగా నష్టపోతున్నారని, పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. భూములు కోల్పోవడంతో రైతు కుటుంబాలు ఉపాధి లేక పనుల కోసం ఇతర జిల్లాలకు వలసపోతున్నారని, దీంతో ఆ గ్రామాలు శ్మశానాలుగా మారుతున్నాయన్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కొలిమిగుండ్ల మండలంలోని 33 గ్రామాలలో ఇప్పటికే 17 గ్రామాలు రాంకో, అల్ట్రాటెక్, అంబుజా పెన్నా, దాల్మియా కబంధ హస్తాలలో చిక్కుకున్నాయని, ఇల్లు తప్ప ఆయా గ్రామాల ప్రజలకు సెంటు భూమి లేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒకమాట…వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. బనగానపల్లె శాసనసభ్యులు, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి రైతు సమస్యలు తెలిసినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రాంకో యాజమాన్యం బాధిత రైతులకు న్యాయం చేయకుంటే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిని ముట్టడిరచడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఫ్యాక్టరీలో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులు రైతుల ఐక్యత దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. అనంతరం రాంకో జీఎం రవికుమార్ ప్రధాన గేటు వద్దకు చేరుకుని నాయకులతో మాట్లాడారు. సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకుపోతానని, జులై ఏడో తేదీలోపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించకుంటే అదే రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జీఎంకు నాయకులు స్పష్టంచేశారు.
The post రాంకోను ముట్టడిరచిన సీపీఐ appeared first on Visalaandhra.
. ప్రధాన గేటు వద్ద బైఠాయింపు… ఉద్రిక్తత. బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ విశాలాంధ్ర – కొలిమిగుండ్ల : బాధిత రైతులకు రాంకో సిమెంట్ యాజమాన్యం న్యాయం చేయాలని సీపీఐ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వందలాదిగా తరలివచ్చిన సీపీఐ, ఏఐకేఎస్, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తల ముట్టడితో రాంకో ప్రధాన గేటు పరిసర ప్రాంతం సోమవారం దద్దరిల్లింది. ఎర్రజెండాలు చేతబట్టి రాంకో ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. సీపీఐ రాష్ట్ర
The post రాంకోను ముట్టడిరచిన సీపీఐ appeared first on Visalaandhra.