రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన

Follow

- పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్
- పెద్దధన్వాడకు వెళ్తున్న నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
ఇటిక్యాల, జూన్ 18 : రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతున్నదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇథనాల్ ప్యాక్టరీ, రైతుల ఉద్యమాలు వారిపై దాడుల ఘటనలపై నిజనిర్ధారణ కోసం బయలు దేరిన పౌరహక్కుల నేతలను బుధవారం ఎర్రవల్లి చౌరస్తాలో అలంపూర్ సీఐ రవిబాబు, ఎస్సై వెంకటేశ్ అరెస్ట్ చేసి ఇటిక్యాల స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని కోరుతున్న రైతులపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించడం, అక్రమంగా కేసులు పెట్టించడం హేయమైన చర్య అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
గ్రామసభలు జరిపి ప్రజల ఆమోదం లేకుండా ఇథనాల్ ప్యాక్టరీ ఏర్పాటు చేయడం ప్రజాసామ్య విరుద్ధమన్నారు. రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పోలీసుల అండతో పరిపాలన సాగించడం మానుకోవాలని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో గడ్డం లక్ష్మణ్‌తోపాటు సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుభాన్, నాయకులు జక్కా బాలయ్య, వెంకటేశ్, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతున్నదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇథనాల్ ప్యాక్టరీ, రైతుల ఉద్యమాలు వారిపై దాడుల ఘటనలపై నిజనిర్ధారణ కోసం బయలు దేరిన పౌరహక్కుల నేతలను బుధవారం ఎర్రవల్లి చౌరస్తాలో అలంపూర్ సీఐ రవిబాబు, ఎస్సై వెంకటేశ్ అరెస్ట్ చేసి ఇటిక్యాల స్టేషన్‌కు తరలించారు.