రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలి

Follow

- మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. వానకాలం 2025 సీజన్‌కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,25,485 మంది రైతుల ఖాతాల్లో రూ.134.43 కోట్లు జమైనట్లు ఆయన తెలిపారు.
DBT Failure అయిన రైతులు మరలా వారికి సంబంధించిన మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళ్లి సంప్రదించాలని సూచించారు. జూన్ 5 లోపు కొత్తగా పట్టా పుస్తకం వచ్చినవారు వారి పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకొని సంబంధిత వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఈనెల 20లోపు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. వానకాలం 2025 సీజన్‌కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,25,485 మంది రైతుల ఖాతాల్లో రూ.134.43 కోట్లు జమైనట్లు ఆయన తెలిపారు.