రైతులకు బేడీలా..?

Follow

- బీఆర్‌ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
వికారాబాద్, జూన్ 18 : రైతులకు మళ్లే బేడీలు వేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివారులో నిర్మించతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని ఆయా గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. అనారోగ్యానికి మూలం అని..
భవిష్యత్‌లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో.. ఫ్యాక్టరీ వద్దు అని నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. దీంతో రైతులపై లాఠీచార్జి జరిపి, పదుల సంఖ్యలో అమాయక రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారని తెలిపారు. తాజాగా వారి రిమాండ్ ముగియడంతో ఆలంపూర్ కోర్టులో హాజరుపరిచేందుకు రైతులకు సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక సామాన్య రైతు తన భూమి కోసం, ఆరోగ్యం కోసం, వారి పిల్లల భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నందుకు జైలు, బేడీలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళనకు దిగిన రైతులపై ప్రభుత్వం అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు తరలించిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ప్రభుత్వం తీరుని తప్పుపడితే చాలు.. వాళ్లను అరెస్టు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం రైతును ఒక దేశద్రోహిని, టెర్రరిస్టును చూసినట్టు చూస్తున్నదన్నారు. లగచర్ల రైతులకు బేడీలు వేసినట్టే.. ఇక్కడి రైతులకు కూడా సంకెళ్లు వేసి రైతన్నల పట్ల రేవంత్ సర్కార్ క్రూరంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉద్దేశపూర్వక రాక్షసత్వం, నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా మానుకొని వారికి మంచి చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులకు మళ్లే బేడీలు వేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివారులో నిర్మించతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని ఆయా గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.