రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ మరో కీలక అప్డేట్.. వారి అకౌంట్లలోకూడా నగదు.. మరో వారంరోజుల్లో మొత్తం కంప్లీట్..

Follow

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హామీ మేరకు వరుసగా మూడోరోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అయితే, ఈ ప్రక్రియ మరో వారంరోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం బుధవారం వరకు రాష్ట్రంలో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రైతు భరోసా కోసం మొత్తం రూ.5,215.26 కోట్లను విడుదల చేసి, 58.04 లక్షల మంది రైతులకు సాయం అందించినట్లు మంత్రి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, ఎకరాల సంఖ్యతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రూ.77వేల కోట్లను రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. రూ.2లక్షలలోపు రైతు రుణమాఫీ పూర్తిచేసి, దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. రైతు భరోసా కింద సాయాన్ని ఎకరాకు రూ.5వేల నుంచి రూ.6వేలకు పెంచామని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ రైతులకోసం ఎలాంటి పథకాలను ఆపలేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెలంగాణ రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని, వారి సంక్షేమంకే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..