రోహింగ్యాలకు ఫేక్ సర్టిఫికెట్లపై ఎంక్వైరీ..జీహెచ్ఎంసీని రిపోర్ట్ కోరిన ఇంటెలిజెన్స్

Follow

- బల్దియా బర్త్, డెత్సర్టిఫికెట్లపై భారత జాతీయులుగా ధ్రువీకరణ
- కేంద్ర హోంశాఖ హెచ్చరికలతో రంగంలోకి స్టేట్ఐబీ
- వెరిఫై చేసి రిపోర్ట్ఇవ్వాలని కమిషనర్ ఆదేశాలు
- బార్కస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచే 30 సర్టిఫికెట్ల జారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరంలో రోహింగ్యాలకు జారీ అయిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. రోహింగ్యాలకు జారీ చేసే సర్టిఫికెట్లలో నేషనాలిటీ అనే చోట ‘యునైటెడ్నేషన్(యూఎన్) ఎక్స్ సీఆర్’ అని ఉండాలి కానీ, ఇండియన్అని ఇవ్వడంతో వాటి ఆధారంగా చాలా మంది ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలు సంపాదించి ఇండియన్సిటిజన్షిప్పొందారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగింది.
నగరంలో బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్న చాలామంది ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు పొందారని తమ దృష్టికి వచ్చిందని, వాటి సంగతి తేల్చాలని కోరింది. దీంతో వారు రోహింగ్యాలు, ఇతర దేశస్తులకు సంబంధించి ఇప్పటివరకు జారీ అయిన సర్టిఫికెట్లపై పూర్తి రిపోర్ట్ఇవ్వాలని బల్దియాను కోరినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశంపై బీజేపీ కార్పొరేటర్లు అధికారుల తీరును విమర్శించారు. రెండురోజులక్రితం కమిషనర్ ను కలిసి రోహింగ్యాలకు ఇచ్చిన బర్త్, డెత్సర్టిఫికెట్ల వ్యవహారాన్ని తేల్చాలని వినతిపత్రం ఇచ్చారు.
బార్కాస్లోనే 30 సర్టిఫికెట్లు
ఇంటెలిజెన్స్బ్యూరో రిపోర్ట్అడగం, బీజేపీ లీడర్లు వినతిపత్రం ఇవ్వడంతో ఇప్పటివరకు రోహింగ్యాలకు ఎన్ని బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారు? అందులో ఫేక్ ఎన్ని ఉన్నాయి? అన్నవి సర్కిల్ వారీగా వెరిఫై చేయాలని మెడికల్ ఆఫీసర్లకు కమిషనర్ కర్ణన్ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు తమ పరిధిలోని హాస్పిటళ్లలో రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క బార్కాస్ ఏరియా హాస్పిటల్ లోనే రోహింగ్యాలను దాదాపు 30 వరకు బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు తెలుసుకున్నారు. ఇలా నగరంలో అనేక హాస్పిటల్స్ ఉండగా, విచారణ కొనసాగుతోంది.
రికవరీ చేయట్లే
రోనాల్డ్ రోస్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఫలక్ నుమా సర్కిల్లో 60 వరకు అక్రమ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని గుర్తించి ఒక సీనియర్ అసిస్టెంట్ ను జైలుకు పంపారు. అయితే, ఆ సర్టిఫికెట్లను ఇప్పటివరకు రికవరీ చేయలేదు. తాజాగా టోలిచౌకి పరిధిలో ఉండే ఒక ప్రైవేట్హాస్పిటల్లో 65 బర్త్ సర్టిఫికెట్లు, 8 డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారని గుర్తించిన అధికారులు వాటిని కూడా రికవరీ చేయట్లేదు.
ఆయా సర్కిళ్లలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, హెడ్డాఫీసులో పనిచేసే చీఫ్ మెడికల్ ఆఫీసర్ సర్టిఫికెట్లను రికవరీ చేయాల్సి ఉండగా, పట్టించుకోవడం లేదు. ఈ మధ్యే జీహెచ్ఎంసీ పరిధిలో పుట్టకపోయినా, ఇక్కడే పుట్టినట్లుగా ఫేక్సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలుస్తోంది. మలక్ పేట్, ఫలక్నుమా సర్కిళ్ల పరిధిలో ఇలాంటి సర్టిఫికెట్లు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
రోహింగ్యాలకు ఫేక్ సర్టిఫికెట్లపై ఎంక్వైరీ..జీహెచ్ఎంసీని రిపోర్ట్ కోరిన ఇంటెలిజెన్స్