లండన్‌కు సూర్యకుమార్

Follow

- స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స
ఢిల్లీ: టీమ్‌ఇండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లాడు. కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. లండన్‌లో సంబంధిత స్పెషలిస్ట్‌ను కలిసి అతడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. ఒకవేళ అవసరమైతే అతడు శస్త్రచికిత్సకు వెళ్లే అవకాశమున్నట్టు సూర్య సంబంధీకులు తెలిపారు.
‘సూర్య కుడి పొత్తి కడుపులో స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. కన్సల్టేషన్ కోసం అతడు లండన్ వెళ్లాడు. అవసరమైతే అతడు శస్త్రచికిత్స చేసుకుంటాడు’ అని వెల్లడించాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టుకు ఆగస్టు-సెప్టెంబర్ దాకా ద్వైపాక్షిక సిరీస్‌లు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో ఆ లోపు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించాలని సూర్య భావిస్తున్నట్టు సమాచారం.
టీమ్‌ఇండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లాడు. కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. లండన్‌లో సంబంధిత స్పెషలిస్ట్‌ను కలిసి అతడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు.