వన మహోత్సవం లక్ష్యసాధనకు కృషిచేయాలి

Follow

- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
కంఠేశ్వర్, జూన్ 18: వన మహోత్సవం లక్ష్య సాధనకు కృషిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత్సవంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, డీఎఫ్‌వో వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా వన మహోత్సవంలో నాటాల్సిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు.
మండల ప్రత్యేకాధికారులు, సూపర్‌వైజరీ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లినప్పుడు గ్రామాల్లోని నర్సరీలు, వైకుంఠధామాలు, ప్రభుత్వ కార్యాలయాలను తప్పకుండా సందర్శించాలని ఆదేశించారు. అటవీశాఖ అధికారులు ప్రతి గ్రామ పంచాయతీని విధిగా సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించాలన్నారు. గతేడాది మొక్కలు నాటిన ప్రదేశాలతో పాటు ప్రస్తుత సంవత్సరంలో మొక్కలు నాటనున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బ్లాక్ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యతనివ్వాలని, 2026లో చేపట్టే వనమహోత్సవం కోసం ఇప్పటి నుంచే నర్సరీల్లో మొక్కల పెంపకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నవంబర్ నాటికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా నర్సరీ నిర్వహణ చేపట్టాలని కమిషనర్ దిలీప్‌కుమార్‌ను ఆదేశించారు.
భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. ఐడీవోసీ వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో రోడ్ల విస్తరణ, రైల్వే పనులు, నీటిపారుదల, జాతీయ రహదారులు, పరిశ్రమల స్థాపన తదితర వాటికి అవసరమైన భూసేకరణపై సంబంధిత అధికారులతో శాఖల వారీగా కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
వన మహోత్సవం లక్ష్య సాధనకు కృషిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత్సవంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, డీఎఫ్‌వో వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు.