వర్షాకాలంలో సందర్శించడానికి నాలుగు అందమైన ప్రదేశాలు ఇవే!

Follow
వర్షాకాలం వచ్చిందంటే చాలు పచ్చటి ప్రకృతి, తొలకరి చినుకులు, పక్షుల కిలకిలలతో కొన్ని ప్రదేశాలు స్వర్గా్ని తలపిస్తాయంట. అంతే కాకుండా ఇటువంటి ప్రదేశాలకు మీరు ఒక్కసారి వెళ్లి వెచ్చినా, జీవితాంతం ఆ అనుభూతిని మర్చిపోరంట. అంతలా ఆ ప్రకృతి తన సౌందర్యంలో పర్యాటకులను బంధీలను చేస్తుందంట. పచ్చని చెట్లు, కొండలతో కొన్ని ప్రదేశాలు వర్షాకాలంలో అదంగా ఉంటాయంట. కాగా, ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోవా : అద్భుతమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. ఇది అందమైన బీచ్‌లకు నిలయం. ఇక్కడికి నిత్యం వేల మంది పర్యటనకు వెళ్తూ ఉంటారు. అయితే చాలా మంది ఎక్కువ వేసవికాలంలోనే వెళ్తుంటారు. కానీ వర్షకాలంలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. ఎందుకంటే? ఈ సీజన్లో ఇక్కడి అతి సుందరమైన ప్రదేశాలు, పచ్చటి ప్రకృతి, వర్షంలో నృత్యం చేయడానికి కూడా ఇది ఉత్తమమైన ప్రదేశం. ఉత్సాహభరితమైన పచ్చదనం,తడి నేల వాసన ఒక మాయా వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక ఇక్కడికి వెళ్లిన వారు బీచ్, దూద్ సాగర్ జలపాతాలు, అగ్వాడా కోటను సందర్శించవచ్చు.
లోనావ్లా, పూణే: వర్షాకాలంలో పూణే అందాలను వర్ణించడం అనేది అంత సులువు కాదు ఎందుకంటే. ఈ సీజన్లో ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుందంట.ఇక్కడి పచ్చటి చెట్లు, టైగర్ పాయింట్, సరస్సులు, నీటి బిందువులతో కప్పబడే, టికోనా వంటివి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అందుకే వర్షకాలంలో సందర్శించే ఉత్తమ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.
మున్నార్, కేరళ : వర్షాకాలంలో కేరళ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా మున్నార్‌లోని టీ తోటలు, రోలింగ్ హిల్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవే కాకుండా పొగమంచుతో కప్పబడన పర్వతాలు, ఎరవికులం జాతీయ ఉద్యానవనం, దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టుపెట్టి శిఖరం, ఆనముడి శిఖరం వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
కూర్గ్, కర్ణాటక: చాలా మందికి తెలియదు కానీ కూర్గ్‌ను స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే, మీ కళ్ళకు ప్రశాంతత చేకూర్చడానికి వర్షాకాలంలో సందర్శించడానికి కూర్గ్ బెస్ట్ ప్లేస్. ఇక్కడి కాఫీ తోటలు, మంత్రముగ్ధులను చేసే జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. దాని ట్రెక్కింగ్ ట్రైల్స్ , అబ్బే జలపాతం, రాజాస్ సీట్,నాగర్హోల్ నేషనల్ పార్క్ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అనువైన గమ్యస్థానంగా మారాయి.
వర్షాకాలంలో ట్రిప్‌కు వెళ్లాలి అనుకునే వారికి ఇదే అద్భుతమైన సమాచారం. ఎందుకంటే? భారతదేశం పచ్చటి ప్రకృతికి నిలయం. ఇక వర్షకాలం వస్తే చాలు ఇది మరింత అద్భతంగా కనిపిస్తుంది. కాగా, వర్షకాలంలో కొన్ని ప్రదేశాలు సందర్శిస్తే, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందంట. కాగా, వర్షాకాలంలో భారతదేశంలో సందర్శించాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఏవో చూద్దాం.