వసుధైక కుటుంబం…

Follow

ఆనాటి విశాలమైన నా భవంతి!!
నా చుట్టూ పచ్చని పైర్లు
విరబూసిన పూల వరుసలు
పాలనురగ మూతితో లేగ దూడల పరుగులు
ఆ పరుగుల వెనక బాలల బుడి బుడి అడుగులు
ఆ అడుగుల వెంట గోరు ముద్దలతో అమ్మల పరుగులు
పండిన పంటను కడుపులో మోసిన ఎద్దుల బండి సొగసులు
ఆ సొగసుల నొగలపై పసిపాపల పడకలు
ఆ పడకలలోని పాప కిలకిల నవ్వుల మెరుపులు
ఆ మెరుపుల కాంతుల్లో ఎగిరే పక్షుల కిలకిల రావాలు
అటు సూర్యోదయ బంగారు ఛాయలు
నా ముంగిట్లో అందాల ముగ్గుల ముచ్చట్లు
సత్ జీవనానికి పునాదులు
అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాత మనుమలు
ఎందరో ముని-ముని మనుమల తరాల తారలు
ఓ బతుకమ్మ.. ఓ సంక్రాంతి.. ఓ దీపావళీ ఎన్ని పండగలో
కలలు పంచుకొనే కుటుంబం
అత్తల మాటలు, కోడళ్ళ పాట్లు,
వదినల తిట్లు, బావల సరదాలు…
లెక్కతేలని పిల్లల సంఖ్యతో
ఎంత పెద్ద ‘సు’పరివారం
బామ్మ చిట్కాతో దగ్గు మాటుమాయమై
ఇంట్లో ధన, ధాన్య రాశులు సమష్టి కృషి నిధులు
ఇంట్లోకి ఏ అతిథి వచ్చినా అదొక విశ్రాంతి గృహం
ఇంటిముందు ఏ బిచ్చగాడు వచ్చినా
అదొక ఆకలిని పారద్రోలిన వాకిలి
ఆ వాకిలి ఇప్పుడు ఏ ఆకలికి బలయ్యిందో!!
ఉన్న నల్గురు నాల్గు భాగాలే
నిత్యం ఏదో ఒక వాదం విభేదం
ఇంటి నుండి రోదనల రోదలే
శాంతి లేక అశాంతితో విలపిస్తున్న
ఊరికి పెద్ద మోతుబరి రైతు
ఆ కుటుంబం నేడు మరో రైతుకు కూలీలయ్యారు
చిన్న కుటుంబం చింతలున్న కుటుంబం
అందుకే సమష్టి కుటుంబం సిరి సంపదలతో
తులతూగే కుటుంబం
– కర్నె మల్లికార్జున్ 63037 44239
ఆనాటి విశాలమైన నా భవంతి!!
నా చుట్టూ పచ్చని పైర్లు
విరబూసిన పూల వరుసలు
పాలనురగ మూతితో లేగ దూడల పరుగులు