వానల్లో పొట్టకు చిక్కులు

Follow

వానకాలంలో కలుషిత జలం కారణంగా చాలామందిలో పొట్ట సంబంధ సమస్యలు తలెత్తుతుండటం సహజమైన విషయం. ఈ కాలంలో సూక్ష్మక్రిములు, మురికితో నీళ్లు కలుషితం అవుతుంటాయి. దీంతో ఈ నీటిని తాగినా, వీటితో వండిన పదార్థాలను తిన్నా పొట్ట ఇబ్బందులు చుట్టుముడతాయి. చిన్నపిల్లలు, పెద్దలకు మరీ సమస్యగా ఉంటుంది. వీరికి ఇన్ఫెక్షన్లు తొందరగా సోకుతుంటాయి.
ఎలాంటి లక్షణాలు..
- నీళ్ల విరేచనాలు, అతిసారం (డయేరియా)
- వికారం, వాంతులు
- కడుపునొప్పి
- బాగా అలసిపోయినట్టు అనిపించడం, మగతగా ఉండటం
- ఎంతకూ విడువని జ్వరం
ఒకవేళ ఎవరికైనా వాంతులు, నీళ్ల విరేచనాలు, బాగా అలసిపోయినట్టు ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలి. డీహైడ్రేషన్ వల్ల ఇలా జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
నివారణ చర్యలు
- కాచిన నీళ్లను తాగాలి. లేదంటే మంచి ఫిల్టర్‌ను ఉపయోగించాలి.
- పండ్లు, కూరగాయలను బాగా కడగాలి.
- స్ట్రీట్ ఫుడ్, మూతలు లేని పాత్రల్లో ఉన్న ఆహారం తినకూడదు.
- తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. తినడానికి ముందు, టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత తప్పనిసరి.
- ఇంటి పరిసరాల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేదంటే అవి రోగకారక క్రిములు, దోమలకు ఆవాసాలుగా మారిపోతాయి.
నిర్లక్ష్యం వద్దు
ఎవరికైనా బాగా బలహీనంగా అనిపించినా, తగినన్ని నీళ్లు తాగకపోయినా, మలంలో రక్తం విసర్జించినా సత్వరమే వైద్య సహాయం తీసుకోవాలి. రోజువారీ అలవాట్లలో చిన్నచిన్న మార్పులతో చాలా ఇన్ఫెక్షన్లను అడ్డుకోవచ్చు. ఈ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా గడపండి.
వానకాలంలో కలుషిత జలం కారణంగా చాలామందిలో పొట్ట సంబంధ సమస్యలు తలెత్తుతుండటం సహజమైన విషయం. ఈ కాలంలో సూక్ష్మక్రిములు, మురికితో నీళ్లు కలుషితం అవుతుంటాయి.