వామ్మో.. మనిషి స్వార్థం వెనుక అంతుందా..? DNA లోనే..

Follow

సాధారణంగా DNA అంటే ఒక జీవికి కావాల్సిన మొత్తం సమాచారం ఉండే బ్లూప్రింట్ అనుకుంటాం. కానీ ఇందులో ప్రతి భాగం మనకు ఉపయోగపడదు. కొన్ని జన్యువులు (Gene) పరాన్నజీవుల్లా (Parasite) ప్రవర్తిస్తాయి. అవి తమ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా మన శరీరంలో ఉంటాయి. ఇవి తమ అవసరాల కోసం DNA లోపలికి ప్రవేశించి అనవసరమైన మార్పులు చేస్తాయి. వీటిని తొలగించకపోతే శరీరంలో ముఖ్యమైన ప్రోటీన్లు తయారయ్యే పనిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.
స్వార్థ జన్యువుల పనితీరు ఎలా ఉంటుందంటే..? ఈ జన్యువులు తమను తాము కాపాడుకుంటూ DNAలో కాపీలు తయారు చేసుకుంటూ వ్యాపిస్తాయి. వాటి వల్ల జీవి శరీరంలో ప్రోటీన్ల తయారీ ప్రక్రియ సరిగా జరగకపోవచ్చు. DNAలో ఉండే ఈ స్వార్థ జన్యువుల వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన ప్రకారం.. ఇవి జీవుల మధ్య సంబంధం లేకపోయినా.. ఒక జీవి నుండి మరో జీవికి దూకుతూ వెళ్తాయి.
ఇన్ ట్రోనర్ లు.. ఈ ఇన్ ట్రోనర్ లు, జంపింగ్ జీన్స్ అని పిలువబడే ట్రాన్స్‌పోజబుల్ ఎలిమెంట్స్ కిందకు వస్తాయి. ఇవి DNAలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా కదలగలవు. ఈ జన్యువులు ఒక జీవిలోని మొత్తం జన్యుపరమైన సమాచారాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. DNAలోని వివిధ భాగాల్లో తమను తాము కాపీ చేసుకుంటూ వ్యాపిస్తూ.. ఇతర జీవుల జన్యు నిర్మాణంలోకి కూడా ప్రవేశించగలవు.
ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వేల సంఖ్యలో జీవుల DNAను పరిశీలించారు. ఈ క్రమంలో ఇన్ ట్రోనర్ ల (పనికిరాని DNA భాగాలు) ఉనికి.. అవి ఎలా వ్యాపిస్తాయో తెలుసుకున్నారు. ఎర్త్ బయోజీనోమ్ ప్రాజెక్ట్ (Earth BioGenome Project), సాంగర్ ట్రీ ఆఫ్ లైఫ్ (Sanger Tree of Life) లాంటి పెద్ద ప్రాజెక్టుల సాయంతో ఈ పరిశీలన విజయవంతమైంది.
DNAలోని ఈ రహస్య భాగాలు జీవుల ప్రవర్తనపై.. వాటి లక్షణాలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటి గురించి బాగా తెలుసుకోవడం వల్ల అనేక జబ్బులకు పరిష్కారం కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ద్వారా స్పష్టంగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే.. మనలోని కొన్ని స్వభావాలు, ముఖ్యంగా స్వార్థం సామాజిక ప్రభావం వల్ల కాకుండా.. మన శరీర నిర్మాణం నుంచే రావచ్చు. DNAలో దాగి ఉన్న ఈ ఇన్ ట్రోనర్ జన్యువుల ప్రభావాన్ని అర్థం చేసుకుంటే.. మానవ ప్రవర్తనపై కొత్త కోణంలో పరిశోధనలు చేయవచ్చునని ఈ అధ్యయనం సూచిస్తుంది.
మనిషిలో స్వార్థం ఎందుకు ఉంటుందనేది ఎప్పటి నుంచో చర్చకు వస్తున్న ప్రశ్న. సామాజిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, మానసిక నిపుణులు దీనిపై చాలా పరిశోధనలు చేశారు. అయితే ఇటీవల అమెరికాలో జరిగిన ఒక కొత్త పరిశోధన ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. మన స్వభావంలో కనిపించే స్వార్థం DNAతో సంబంధం కలిగి ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం.. ఇన్ ట్రోనర్ (Introner) అని పిలిచే జన్యు భాగాలు మన DNAలో దాగి ఉండి వివిధ జీవుల మధ్య స్వార్థాన్ని ప్రేరేపిస్తాయి.