వావ్.. ఎయిర్‌పోర్ట్‌లో క్లీనింగ్ రోబోలు వీడియో

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
వావ్.. ఎయిర్‌పోర్ట్‌లో క్లీనింగ్ రోబోలు వీడియో

ఒకసారి ఎయిర్‌పోర్ట్ మొత్తం మ్యాపింగ్ చేసి ఇచ్చేస్తే చాలు.. ఇక.. ఈ రోబోలు ఈ చిట్టి రోబోలు..రోజంతా ప్రతి కార్నర్‌కీ తిరిగి అలుపెరగకుండా క్లీన్ చేస్తూనే ఉంటాయట. అంతే కాదండోయ్.. ఎయిర్ పోర్ట్ లోపల ఎక్కడైనా చెత్త, ఖాళీ చేసిన మంచినీళ్ల బాటిల్స్ కనిపిస్తే టక్కున వెళ్లి మనిషి మాదిరిగా ఏరిపారేస్తాయి. అంతేకాదు.. ఎక్కడైనా ఫ్లోర్ తడిగా ఉంటే .. ఎవరూ చెప్పే పనిలేకుండా వెళ్లి పోయి చకచకా ఆ ప్రాంతానికి వెళ్లి ఆ తడి ఆరిపోయే వరకు క్లీన్ చేసేస్తాయి. క్లీన్ చేసే క్రమంలో ఎవరకైనా ప్రయాణికులు అడ్డంగా వస్తే.. సెన్సార్ల సాయంతో గుర్తించి, టక్కున ఆగిపోయిన ఆ మనిషి వెళ్లి పోగానే నేరుగా పనిలో దిగిపోతుంది. ఈ రోబోల మేధస్సు ఎంతంటే.. అవి పొరబాటున కూడా ఎయిర్ పోర్టులో ఉన్న ప్రైవేటు దుకాణాలు, లీజుకు ఇచ్చిన ప్రదేశాల్లో అడుగే పెట్టవు. ‘అది మా ఏరియా కాదు’ అన్నట్లుగా తనకు కేటాయించిన ప్రదేశానికే పరిమితమవుతాయి. ప్రయాణం హడావుడిలో ఎవరైనా కాయిన్స్, గోల్డ్, వాలెట్ లాంటివి పారేసుకుంటే.. వాటిని గుర్తించి, వాటిని ఏరి తీసుకుని, వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి సమాచారం ఇస్తుంది. ఈ రోబోకు ఇంకో ప్రత్యేకత ఉంది. తనలో చార్జింగ్ అయిపోతుంది అనగానే.. తనంతట తానే చార్జింగ్ పోర్టు వద్దకు వెళ్లి రీచార్జ్ చేసుకుంటుంది. అలుపు సొలుపూ లేకుండా మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనిచేసి ఎయిర్ పోర్టును అద్దంలా ఉంచటమే ఈ రోబో ప్రత్యేకత.

మరిన్ని వీడియోల కోసం :

పాముకు ముద్దుపెట్టిన రైతు.. చివరకు వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

భర్త అంటే ఇష్టం లేని భార్య ఏం చేసిందో చూడండి వీడియో

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో

 

 

​దేశంలో విమాన సేవలు పెరుగుతున్న కొద్దీ ఎయిర్‌పోర్ట్‌లలో నానాటికీ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అనే తేడా లేకుండా ఏ విమానాశ్రయంలో చూసిన రద్దీ వాతావరణమే కనిపిస్తోంది. దీంతో ఎయిర్ పోర్టుల మెయింటెనెన్స్ అనేది రోజురోజుకు కష్టమైపోతోంది. దీంతో, ఎయిర్ పోర్ట్ ఏజెన్సీలు.. టెక్నాలజీ వైపు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రయోగాత్మకంగా కొన్ని ఆటోమేటిక్ క్లీనింగ్ రోబోలను రంగంలోకి దింపాయి. తాజాగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ రోబోలు దర్శనమిచ్చాయి. ఎంతో శ్రద్ధగా, పొందికగా ఎయిర్‌పోర్ట్ ప్లోర్‌ను అద్దంలా క్లీన్ చేస్తోన్న ఈ రోబోల గురించి అక్కడి అధికారులు పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *