వింత ఘటన..పనస చెట్టుకు కాయలు కాదు.. డైరెక్ట్‌ తొనలే కాసేస్తున్నాయ్‌గా!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
వింత ఘటన..పనస చెట్టుకు కాయలు కాదు.. డైరెక్ట్‌ తొనలే కాసేస్తున్నాయ్‌గా!

అతను తన ఇంటి పెరట్లో ఓ పనస చెట్టు నాటాడు. ఏళ్లుగా ఆ పనస చెట్టు కాయలు కాస్తూ గణేష్ కు ఆదాయం తెచ్చిపెడుతుంది. సీజన్ వచ్చిందంటే చాలు గుత్తుల గుత్తులుగా కాయలు కాస్తూ ఉంటుంది ఆ పనస చెట్టు. అయితే ఈ ఏడాది ఆ చెట్టు విచిత్రమైన కాపు కాసింది. ఆ చెట్టుకు కాసిన కొన్ని పనసకాయల మధ్యన.. నేరుగా పనస తొనలు కనిపించాయి. తొలుత అంతగా పట్టించుకోని గణేష్.. ఆ తర్వాత అవి క్రమంగా పెద్దదవుతుంటే ఏమై ఉంటుందా అని పరిశీలించి చూసాడు. పనస తొనలే నేరుగా కనిపిస్తుండడంతో చూసి ఆశ్చర్యపోయాడు. పనస చెట్టు కాండానికి కాసిన కాయల మధ్య ఓ కాయ పొట్టలోంచి విచ్చుకొని బయటకు తొనలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాస్తవానికి పనస చెట్టుకు కాయలు కాస్తాయి. చెట్టు కాండానికి గుత్తుల గుత్తులుగా కాయలు కాస్తు కనిపిస్తాయి. అలా చెట్టుకు ఉన్న కాయల్లో తొనల కోసం చిన్న గాటు పెట్టిన సరే.. ఆ కాయ పెరగదు సరికదా కుళ్ళిపోతుంది. కానీ.. నేరుగా ఓ కాయ విచ్చుకొని.. అందులోంచి తొనలు బయటకు వచ్చి చెట్టుకే ఆ తొనలు పెరుగుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు గణేష్. విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో.. చుట్టుపక్కల ప్రజలు ఆ వింతను చూసేందుకు గణేష్‌ ఇంటికి క్యూకడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ ఐడియా.. రిక్షా తొక్కలేక అతనేం చేశాడంటే..!

మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే.. పట్టిందల్లా బంగారమే

పనిమనిషితో యవ్వారం.. ఉరితాడుకు పెళ్లాం..! సస్పెన్స్‌తో నరాలు తెగిపోవడం పక్కా

వేసవి తాపం నుంచి తప్పించుకోడానికి ఇతని ఐడియా అదుర్స్‌

ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే అద్భుతమైన ప్రయోజనాలు

​సాధారణంగా పనస చెట్టు కాండానికి కాయలు కాస్తాయి. అవి పెద్దగా అయి పక్వానికి వచ్చిన తర్వాత వాటిని కోసి తింటారు. కానీ ఓ పనస చెట్టు వింతకాపు కాసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పనస కాయలు కాకుండా ఏకంగా తొనలే కాసాయి ఈ చెట్టుకి. ఈ వింత ఘటన అల్లూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని చింతపల్లి మండలం తమ్ముంగుల పంచాయతీ మారుమూల ప్రాంతమైన గిరిజన గూడెం కిమిలి సింగు గణేష్ అనే ఒక గిరిజనుడు నివాసం ఉంటున్నాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *