విధ్వంసానికి అధికారులే బాధ్యులు.. అక్రమ నిర్మాణాలపై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్య

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
01
  • ఆ అధికారుల ఫొటోలను ట్యాంక్‌బండ్‌పై పెట్టాలి

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలకు తొలగింపులో సంబంధిత అధికారులు చేతులు ఎత్తేస్తున్నారని, ఎవరికి వారు చేతులు దులిపేసుకోవడం తప్ప బాధ్యతలు నిర్వహించడం లేదని హై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల తీరు సమర్థనీయంగా లేదని మండిపడింది. అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన అధికారులను గుర్తించి వారి ఫొటోలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించాలని వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ స్టాం డింగ్‌ కౌన్సిల్స్‌ నుంచి కార్పొరేషన్‌ కమిషనర్‌, టాస్‌ఫోర్స్‌ ఇలా ఎవరికి వారు తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని ఆక్షేపించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండ లం ఖానామెట్‌లోని తమ భూమిలో ప్రైవేటు వ్యక్తులు రాయపాటి ప్రతిభ, రాయపాటి శ్రీహ ర్ష, జీబీ ప్రసాద్‌ అక్రమ నిర్మాణాలు చేపడుతు న్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి చర్య లు చేపట్టడం లేదని ఆరోపిస్తూ సయ్యద్‌ రహీమున్నీసా మరో ఎనిమిది మంది హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. అక్రమ నిర్మాణాల తొలగింపునకు ఉత్తర్వులు ఇచ్చామని జీహెచ్‌ఎంసీ న్యాయవాది చెప్తున్నారని, కానీ మళ్లీ వెలుస్తూనే ఉన్నాయని, నెలావారీ ఎన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారో నివేదిక కో రాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నా రు. ఒకరు పోలీసులని, మరొకరు టాస్‌ఫోర్స్‌ అని, మరొకరు ఇంకొకరిపైన నెపం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరికి వా రు చేతులు దులిపేసుకుంటున్నారని, చేతులు ఎత్తేస్తే ఎలాగని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ విధ్వంసానికి ఫలానా అధికారి, ఫలానా స్టాండింగ్‌ కౌన్సిల్‌ కారణమని తెలుపుతూ వాళ్ల ఫొటోలను ట్యాం క్‌బండ్‌ పై అందరికీ కనబడేలా పెట్టాలని వ్యా ఖ్యానించారు. విధులు నిర్వహించని ఆ అధికారుల ఫొటోలు రాత్రిళ్లు కూడా అందరికీ కనబడేలా ఉంటే మరీ బాగుంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత విచారణను వాయిదా వేశారు.

​అక్రమ నిర్మాణాలకు తొలగింపులో సంబంధిత అధికారులు చేతులు ఎత్తేస్తున్నారని, ఎవరికి వారు చేతులు దులిపేసుకోవడం తప్ప బాధ్యతలు నిర్వహించడం లేదని హై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల తీరు సమర్థనీయంగా లేదని మండిపడింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *