వివాదంలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ మూవీ.. హైకోర్టును ఆశ్రయించిన మేకర్స్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
వివాదంలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ మూవీ.. హైకోర్టును ఆశ్రయించిన మేకర్స్

ఈ మధ్యకాలంలో సినిమాల పై ఎన్నో రకాల అభ్యంతరాలు వస్తున్నాయి. సినిమాల్లో ఎదో ఒక సన్నివేశం పై అభ్యంతరాల వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కన్నప్ప సినిమాపై కూడా బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల పేర్ల పై వివాదం రేగింది. తాజాగా మలయాళ సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది.   ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ మూవీ టైటిల్ లో జానకి పేరు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో కేరళ హైకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాతలు.. జానకి పేరుపై అభ్యంతరం ఎందుకని కేరళ హైకోర్టు ప్రశ్నినించింది.

మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సెన్సార్ బోర్డుతో వివాదంలో చిక్కుకుంది. బాధిత మహిళ పాత్రకు ‘జానకి’ అనే పేరుపెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు, సినిమా సర్టిఫికేట్ జారీకి నిరాకరించింది. దీనిపై చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. గతంలోనే ఇలాంటి పేర్లతో సినిమాలు వచ్చాయని.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించింది.

అయితే ‘జానకి’ అనే పేరు, గౌరవనీయమైన దేవతగా భావించే సీతాదేవితో సంబంధం ఉన్నందున చిత్రంలో చూపించిన విషయాలు సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 ప్రకారం ఉల్లంఘనకు దారి తీయవచ్చని పేర్కొంది. అందుకే చిత్ర టైటిల్, సంభాషణల నుంచి ఆ పేరును తొలగించాలని చెప్పినట్టు తెలిపింది. జూన్ 12న సినిమా ధ్రువీకరణ కోసం సమర్పించగా, జూన్ 18న స్క్రీనింగ్ పూర్తి చేశారు. కానీ సడెన్‌గా పేరుపై అభ్యంతరం వల్ల సినిమా విడుదల వాయిదా పడిందని, దీంతో ఆర్థికంగా భారీ నష్టాలు వచ్చాయని నిర్మాతలు చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

​మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సెన్సార్ బోర్డుతో వివాదంలో చిక్కుకుంది. బాధిత మహిళ పాత్రకు ‘జానకి’ అనే పేరుపెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు, సినిమా సర్టిఫికేట్ జారీకి నిరాకరించింది. సినిమా పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టుని ఆశ్రయించారు మేకర్స్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *