వీరమల్లుకు ధీటుగా ఔరంగజేబు

Follow

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ఫోక్లోర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. కొంతభాగం ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ప్రస్తుత దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకరరావు భారీబడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ నెల 3న ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరుగనున్నది. ఇది పవన్‌కల్యాణ్ తొలి పాన్‌ఇండియా సినిమా. అలాగే ఆయన నటిస్తున్న తొలి జానపద చిత్రం. ఇందులో పవన్‌కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. చరిత్రలో ఉన్న పాత్రలను తీసుకొని జానపద ధోరణిలో తీసిన కాల్పనిక కథాంశమిది. ‘యానిమల్’లో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ఈ సినిమాలో మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబుగా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభంలో దర్శకుడు క్రిష్.. బాబీడియోల్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
కానీ ‘యానిమల్’లో బాబీడియోల్ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతికృష్ణ.. ‘హరిహరవీరమల్లు’లో ఆయన పాత్రను రీక్రియేట్ చేశాయలని నిర్ణయించారు. బాబీడియోల్ పోషించిన ఔరంగజేబు పాత్రను కొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు. ఈ సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతూ “యానిమల్’లో ఒక్క డైలాగ్ లేకుండా బాబీడియోల్ వ్యక్తపరిచిన హావభావాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయన ఇందులో పోషించిన ఔరంగజేబు పాత్రను మరింత శ్రద్ధతో తీర్చిదిద్దాను. ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలకమైన మార్పులు చేశాను. ఇందులో ఆయన అత్యంత శక్తివంతంగా కనిపిస్తారు.’ అని తెలిపారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్త, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సమర్పణ: ఏ.ఎం.రత్నం, నిర్మాణం: మోగా సూర్య ప్రొడక్షన్స్.
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ఫోక్లోర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. కొంతభాగం ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ప్రస్తుత దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకరరావు భారీబడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.