వెల్‌నెస్ సెంటర్‌లో మందుల్లేవ్..

Follow

రంగారెడ్డి, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : వెల్‌నెస్ సెంటర్‌లో సరిపడా మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల కు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను పంపిణీ చేసేందుకు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
ఇందులో హెల్త్ కార్డు కలిగిన వారందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలకు ప్రతినెలా టెస్టులు చేయడంతోపాటు మందులను అం దించాల్సి ఉంటుంది. కాగా, ఈ సెంటర్‌కు ప్రతిరోజూ జిల్లాలోని పలు ప్రాం తాల నుంచి మూడు నుంచి నాలుగు వందల మంది వస్తుండగా.. సరిపడా మందుల్లేక వారు వెనక్కి వెళ్లిపోతున్నారు. మందుల కోసం ప్రతినెలా రెండు, మూడు సార్లు వెల్‌నెస్ సెంటర్‌కు రావాల్సి పరిస్థితి ఏర్పడడంతో… చాలామంది అక్కడికి వెళ్లలేక ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు.
అధికారులు స్పందించి వెల్‌నెస్ సెంటర్‌లో సరిపడా మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతినెలా మందుల కోసం పడిగాపులు కాస్తున్నామని మంచాలకు చెందిన సత్తారి కృష్ణారెడ్డి అనే ఉద్యోగి పేర్కొన్నారు. హెల్త్ కార్డు ఉన్న వారికి టెస్టులు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులను పంపిణీ చేయాలి. కానీ, గత నాలుగైదు నెలలుగా మందుల సరఫరా నిలిచిపోయింది. పరీక్షలూ చేయడం లేదు. అధికారులు స్పందించాలన్నారు.
వెల్‌నెస్ సెంటర్‌లో సరిపడా మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల కు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను పంపిణీ చేసేందుకు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.