వైద్య రంగంలో మరో అద్భుతం.. 5వేల కిలోమీటర్ల నుంచి ఆపరేషన్‌..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
వైద్య రంగంలో మరో అద్భుతం.. 5వేల కిలోమీటర్ల నుంచి ఆపరేషన్‌..

వైద్య రంగంలో ఒక విప్లవాత్మక పురోగతిలో చైనా వైద్యులు ముందడుగు వేశారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతం చేశారు చైనా డాక్టర్లు. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిమోట్ రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్‌ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈ సర్జరీకి పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ రాంగ్ లియూ నేత నేతృత్వం వహించారు. ఈ శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో ఇకపై మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు, విపత్తుల్లో చిక్కుకున్న ప్రదేశాల్లో దీని ద్వారా చికిత్స సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.

భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలో ఆప్‌స్టార్ 6డీ అనే శాటిలైట్ ఉంది. దీని సాయంతో 68 ఏళ్ల లివర్ క్యాన్సర్‌ రోగికి, 56 ఏళ్ల హెపటిక్ హెమాంగియోమా రోగికి శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఈ రెండు సర్జరీలను కేవలం 105 నుంచి 124 నిమిషాల్లోనే పూర్తిచేశారు. లాసాలోని ఆస్పత్రిలో ఉన్న చీఫ్‌ సర్జన్ రోబోల సాయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

​లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్‌ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈ సర్జరీకి పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ రాంగ్ లియూ నేత నేతృత్వం వహించారు. ఈ శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో ఇకపై మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు, విపత్తుల్లో చిక్కుకున్న ప్రదేశాల్లో దీని ద్వారా చికిత్స సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *