వైష్ణవికి స్వర్ణం

Follow

హైదరాబాద్, ఆట ప్రతినిధి: దావనగెరె (కర్నాటక) వేదికగా జరిగిన 43వ జాతీయ సీనియర్ మహిళల ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ లిఫ్టర్ వైష్ణవి మహేశ్ స్వర్ణ పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 84కిలోల కేటగిరీలో వైష్ణవి.. 555 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
సీనియర్ లిఫ్టర్లకు దీటైన పోటినిస్తూ ముందుకు సాగిన వైష్ణవి.. స్కాట్‌లో 222 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 127కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 205 కిలోల బరువులు ఎత్తి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో అశ్లేష (552, మహారాష్ట్ర), అస్వతి (460, కేరళ) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
దావనగెరె (కర్నాటక) వేదికగా జరిగిన 43వ జాతీయ సీనియర్ మహిళల ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ లిఫ్టర్ వైష్ణవి మహేశ్ స్వర్ణ పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 84కిలోల కేటగిరీలో వైష్ణవి.. 555 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.