వైసీపీ వాళ్లంతా టీడీపీలోకి రావాలి… లేకపోతే.. తోకలు కత్తిరించి సున్నం పెడతాం: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

వైసీపీ వాళ్లంతా టీడీపీలోకి రావాలి… లేకపోతే.. తోకలు కత్తిరించి సున్నం పెడతాం: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

Caption of Image.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా కూడా ఎన్నికల హీట్ ఇంకా చల్లబడలేదు. అధికార టీడీపీ, వైసీపీల మధ్య వార్ రోజురోజుకూ ముదురుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు ఒకవైపు, ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ నిరసనలు మరొకవైపు వెరసి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. ఇప్పుడు గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు చుస్తే పరిస్థితి ఏ రేంజ్ కి వెళ్లిందో అర్థమవుతుంది. వైసీపీ వాళ్లంతా టీడీపీలో చేరాలని.. లేకపోతే తోకలు కత్తిరించి సున్నం పెడతామని అన్నారు గుమ్మనూరు జయరాం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు గుమ్మనూరు జయరాం.

స్థానిక సంస్థల ఎన్నికలోపు వైసీపీ శ్రేణులంతా టీడీపీలోకి రావాలని.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు టైం ఇస్తున్నాని.. టీడీపీలో చేరకపోతే  తోకలు కత్తిరించి సున్నం పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జయరాం. ఒకవేళ లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా కూడా.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తాను రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని హెచ్చరించారు జయరాం.

ఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్దాన్ని మరింత పెంచాయి జయరాం వ్యాఖ్యలు. అధికారం అడ్డుపెట్టుకొని కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని కామెంట్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. 

ఇటీవల జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా పుష్ప 2 సినిమాలోని డైలాగులతో కూడిన ప్లకార్డులు దుమారం రేపిన క్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మరి, జయరాం వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుంది.. కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

​వైసీపీ వాళ్లంతా టీడీపీలోకి రావాలి… లేకపోతే.. తోకలు కత్తిరించి సున్నం పెడతాం: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *