‘వ్యవసాయరంగాన్ని కబళిస్తున్న కార్పొరేట్లు

Follow
X
Follow

హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయరంగాన్ని నాలుగు కార్పొరేట్ కంపెనీలు కబళిస్తున్నాయని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఎస్‌వీకే దొడ్డి కొమురయ్య హాల్లో అరిబండి ఫౌండేషన్, తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ‘వ్యవసాయం రంగం- ఎదురొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా సరళీకరణ విధానాలతో దేశంలో నాలుగున్నర లక్షలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ స్వామినాథన్ కమిటీ సిఫారులను అమలు చేస్తామని మోసం చేసిందని విమర్శించారు.
దేశంలో వ్యవసాయరంగాన్ని నాలుగు కార్పొరేట్ కంపెనీలు కబళిస్తున్నాయని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.