సాక్స్ ల విషయంలో నిర్లక్ష్యం చేయకండి..? ప్రాణాలకే ప్రమాదం.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

Follow

తేమగా ఉండే పాదాలు మురికిగా ఉన్న సాక్స్ లతో కలిసి ఉంటే బాక్టీరియా పెరగడానికి ఇది మంచి వాతావరణం అవుతుంది. రోజులు గడిచే కొద్దీ ఈ సూక్ష్మజీవులు చర్మాన్ని గట్టిగా పట్టుకుని ఇన్ఫెక్షన్ కు దారి తీస్తాయి. కాళ్ళపై చిన్న గాయాలు కూడా పుండులా మారిపోవచ్చు.
డయాబెటిక్ వ్యక్తులకు హెచ్చరిక
మీకు డయాబెటిస్ ఉంటే పాదాలకు సంబంధించి జాగ్రత్తలు మరింత అవసరం. మురికిగా ఉన్న సాక్స్ వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్ త్వరగా మానదు. డయాబెటిస్ ఉన్నవారికి గాయాలు చాలా నెమ్మదిగా మానుతాయి. ఈ తరహా ఇన్ఫెక్షన్లు తీవ్రమై గ్యాంగ్రీన్ వరకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాలకు హానికరమైన స్థితి కూడా కావొచ్చు.
నరాల పనితీరు దెబ్బతినే ప్రమాదం
సరిగ్గా ఉతకని సాక్స్ లు, లేదా బాగా ఇరుకుగా ఉండే సాక్స్ ల వాడకం వల్ల పాదాల్లోని నరాలపై ప్రభావం పడే అవకాశముంది. నరాల పనితీరు బలహీనమవుతుంది. దీన్ని వైద్య భాషలో న్యూరోపతి అంటారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే పాదాలు స్పర్శకు స్పందించకపోవడం, తిమ్మిర్లు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
రక్షణ మార్గం
ఈ సమస్యలన్నింటినీ నివారించడం చాలా సులువు.. ప్రతి రోజు కొత్తగా ఉతికిన సాక్స్ లను మాత్రమే వాడటం. ఉతకకపోతే కనీసం రెండవ జత అయినా వాడాలి. గాలి తగిలే, పత్తితో చేసిన, ముడతలేని సాక్స్ లను ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. తేమ తక్కువగా ఉంటుంది.
నిపుణులు ఏం చెబుతున్నారంటే..
- ప్రతి రోజు సాక్స్ లు ఉతకడం తప్పనిసరి.
- డయాబెటిస్ ఉన్నవారు మరింత శుభ్రత పాటించాలి.
- చిన్న పుండ్లు, గాయాలను కూడా తేలికగా తీసుకోకూడదు.
- రాత్రివేళల్లో పాదాలు పరిశీలించి గాయాలు ఉన్నాయా అని చూసుకోవాలి.
- ఎక్కువ ఉష్ణోగ్రతలో వాష్ చేయడం ద్వారా బ్యాక్టీరియాను నివారించవచ్చు.
చాలా మంది మురికి సాక్స్ ల వాడకాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ దీని వెనుక చాలా ప్రమాదాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది ప్రాణాపాయం దాకా తీసుకెళ్లే పరిస్థితిని కలిగించవచ్చు. శుభ్రతను నిత్యం పాటించడం ద్వారా మీ పాదల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పాదాలు శుభ్రంగా ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కానీ చాలా మంది నిత్యం ఒకే సాక్స్ ను ఉతకకుండా తిరిగి వాడే అలవాటు ఉంటుంది. ఇది చిన్న విషయం అనిపించినా.. దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. వైద్య నిపుణులు ఈ విషయంలో సీరియస్ గా హెచ్చరిస్తున్నారు.