సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూసైడ్

Follow

గత కొద్ది రోజులుగా దేశంలో హత్యలు, ఆత్మహత్యల వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా అనేక కారణాల వల్ల నవ దంపతుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఏదో ఒక కారణంతో ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవటం లేదంటే.. హత్యకు గురికావటం జరుగుతోంది. తాజాగా మరో నవ వధువు పెళ్లైన రెండు నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధించారనే ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన గార్మెంట్ కంపెనీ ఓనర్ అన్నాదురై కుమార్తె రిధన్య వివాహం ఏప్రిల్‌లో కవిన్‌కుమార్‌తో జరిగింది. అయితే, పెళ్లిలో 100 పౌండ్ల (800 గ్రా) బంగారు ఆభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. 2.5 కోట్లు ఖర్చు చేసి వివాహం అంగరంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం అత్తవారింటికి వెళ్లిన రిధన్యకు అంతలోనే వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. వివాహం జరిగిన పది రోజుల్లోనే ఆమె వరకట్నం కోసం వేధించినట్టుగా తెలిసింది. తన భర్త కవిన్ కుమార్ ఆమెను శారీరకంగా, ఆమె మామ, అత్తగారు మానసికంగా హింసిస్తున్నారని, ఆమె తన తండ్రికి తాను ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని చాలాసార్లు చెప్పింది. కానీ ఆమె తల్లిదండ్రులు తమ కూతురిని అంతా బాగానే ఉంటుందని ఓదార్చారు. తిరిగి అత్తవారింటికి పంపించారు.
ఈ క్రమంలోనే ఆదివారం రిధన్య మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని చెప్పిన రిధన్య.. ఇంటి నుండి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె తన కారును ఆపి పురుగుమందుల మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అక్కడే చాలా సేపు ఆగివున్న కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. కారు లోపల రిధన్య చనిపోయి, నోటి నుండి నురుగుతో కనిపించిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో మెసేజ్‌లను పంపింది. అందులో తాను భర్త కెవిన్ తో జీవించలేకపోతున్నానని.. వేధింపులను భరించలేకపోతున్నానని చెప్పింది. అందుకే తాను చనిపోతున్నానని.. దయచేసి తనను క్షమించాలంటూ కోరింది. అత్తవారింట్లో తను పడుతున్న బాధలు, వారు పెడుతున్న మానసిక హింసను భరించలేకపోతున్నానని, ఎవరికి చెప్పాలో తనకు తెలియటం లేదని వాపోయింది.. జీవితం ఇలాగే ఉంటుందని నేను రాజీ పడాలని వినే వారు చెబుతున్నారు. నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ ఆమె తన తండ్రికి మెసేజ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గార్మెంట్ కంపెనీ ఓనర్ అన్నాదురై కుమార్తె రిధన్య వివాహం ఏప్రిల్‌లో కవిన్‌కుమార్‌తో జరిగింది. అయితే, పెళ్లిలో 100 పౌండ్ల (800 గ్రా) బంగారు ఆభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. 2.5 కోట్లు ఖర్చు చేసి వివాహం అంగరంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం అత్తవారింటికి వెళ్లిన రిధన్యకు అంతలోనే వేధింపులు మొదలయ్యాయని చెప్పింది.