సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌షాక్.. వారి వేతనాల నుంచి 15శాతం కోత..

Follow

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరు ఉద్యోగులు వారి తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అటువంటి వారికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Ration Card: కొత్త రేషన్ కార్డుదారులు.. అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ అప్డేట్..
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేందుకు నిర్ణయించారు. 10శాతం నుంచి 15శాతం వరకు వేతనాన్ని కట్ చేసి.. ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అస్సోంలో ఇప్పటికే అటువంటి పథకం అమలవుతోందని, ఇతర రాష్ట్రాల్లో ఇంకా అటువంటివి ఏవైనా ఉంటే పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారిత శాఖలపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలతోపాటు ఐటీ, ఇతర కంపెనీలు వినియోగించుకునేలా చూడాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా తెలంగాణ అంగన్ వాడీలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్ -2047 డాక్యుమెంట్ లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరు ఉద్యోగులు..