సీఏసీ చైర్మన్‌గా ఓఝా?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Pragyan Ojha

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఏజీఎంలో హెచ్‌సీఏ క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ) చైర్మన్‌గా హైదరాబాదీ మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా పేరును మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. దీంతో అతడి నియామకం లాంఛనమే.

ఇక జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు అద్యక్షతన డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోనూ క్రికెట్‌ స్టేడియం నిర్మించేందుకు గాను 25 ఎకరాల భూమిని ప్రభుత్వం హెచ్‌సీఏకు తక్కువ ధరకు ఇచ్చేలా సంఘంలో సభ్యులుగా ఉన్న ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘురామ్‌ రెడ్డి కృషి చేయాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చాముండేశ్వర్‌నాథ్‌ కోరారు.

​హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఏజీఎంలో హెచ్‌సీఏ క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ) చైర్మన్‌గా హైదరాబాదీ మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా పేరును మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *