సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డా. చిరంజీవి 

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

“నవతెలంగాణ”తో తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూ 
నవతెలంగాణ – తాడ్వాయి 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ మలేరియా కలరా టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు నీటిని విలువ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి శుభ్రం చేసుకోవడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల బెడద లేకుండా చూసుకోవడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. 

నవతెలంగాణ విలేఖరి: సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
డాక్టర్ చిరంజీవి: సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి, పరిశుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం, సురక్షితమైన నీటిని మాత్రమే తాగడం మరియు వర్షం నీరు నిలిచిపోయే ప్రదేశాలను నివారించడం వంటి చర్యలు చేపడుతున్నాం. డెంగీ మలేరియా చికెన్ గున్యా ఫైలేరియా మెదడు బాబు దళిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. తాడ్వాయి పీహెచ్సీ పళ్ళు తక్షణ స్పందన బృందాలను ఏర్పాటు చేశాం నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి దోమల నివారణ నిల్వ నీటిలో సంతానోత్పత్తి నివారణకు మందు పిచికారి చేస్తున్నాం అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం.

నవతెలంగాణ విలేఖరి: డెంగీ మలేరియా కేసులు నమోదు అయ్యాయా ? వాటిపై మీ చర్యలు ఏమిటి ? 
డాక్టర్ చిరంజీవి: మండల కేంద్రంలోని తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగీ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కాలేదు. ఎక్కడన్నా ఒక కేసు నమోదు అయితే అక్కడ మెరుగైన చికిత్సలు అందించాం. ఈ నేపథ్యంలో ఆ పరిధిలోని ఆశా కార్యకర్తలతో ఇంటింటా జ్వరం సర్వే చేపట్టాం. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నాం. కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. 

నవతెలంగాణ విలేఖరి: సీజనల్ వ్యాధులకు పిహెచ్సిలు పల్లెదావఖానల సన్నద్దత ఏమిటి ?
డాక్టర్ చిరంజీవి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవఖానలు సీజనల్ వ్యాధుల నివారణ మరియు చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ ను అందించడంలో ఒక ముఖ్యమైన లింక్. ఇవి నివారణ ప్రోత్సాహక చికిత్స పునరావస మరియు ఉపశమన సేవలను అందిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పల్లె దవఖానాలో అన్ని రకాల మందులు నిలువలు ఉన్నాయి. మలేరియా డెంగీ ద ఇతర వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్లు అందుబాటులో ఉంచాం. దోమల నివారణకు పిచికారి ద్రావణాలు ఉన్నాయి. 

నవతెలంగాణ విలేఖరి: వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యపరంగా మీరిచ్చే సలహా ఏమిటి ?
డాక్టర్ చిరంజీవి: గురుకులాలు హాస్టల్లో పాఠశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాం. ఇందుకోసం ప్రత్యేక రూపొందిస్తున్నాం. ఈనెల మొదటి వారంలో క్యాంపులు ప్రారంభిస్తాం. అవసరమైతే రక్ష పరీక్షలు చేస్తాం. ఆకుకూరలు, కూరగాయలు శుభ్రంగా ఉండేది శుభ్రంగా ఉండి తాజా కొనుక్కోవాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

The post సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డా. చిరంజీవి  appeared first on Navatelangana.

​“నవతెలంగాణ”తో తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూ నవతెలంగాణ – తాడ్వాయి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ మలేరియా కలరా టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షపు నీటిని విలువ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి శుభ్రం చేసుకోవడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల బెడద లేకుండా చూసుకోవడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.  నవతెలంగాణ
The post సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డా. చిరంజీవి  appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *