సీనియర్‌ ఫోక్‌ కళాకారులను ఆదుకోవాలి​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Ramanakar
  • తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్‌

జగదేవపూర్‌, జూన్‌ 18 : తెలంగాణలో 30 ఏండ్లుగా పనిచేస్తున్న సీనియర్‌ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్‌ కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ఆవిర్భావంలో కీలక భూమిక పోషించినట్లు గుర్తుచేశారు.

ఎంతోమంది సీనియర్‌ కళాకారులు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు. ఇక నుంచి ప్రతినెలా ప్రతి జిల్లాకేంద్రంలో కళాకారులు అందరితో సభలు నిర్వహిస్తామన్నారు. తమకు ప్రభుత్వం హైదరాబాద్‌లో 500 గజాల స్థలం ఇవ్వాలని, వడ్డీలేని రుణాలు అందించాలని, వృద్ధ కళాకారులకు పెన్షన్‌ అందించాలని విజ్ఞప్తి చేశారు.

బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు అందించి, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్‌బాయ్‌, కోశాధికారి గజ్వేల్‌ వేణు, ఉపాధ్యక్షుడు జీఎల్‌ నాందేవ్‌, సలహాదారులు దరువు అంజన్న, వరంగల్‌ శ్రీను, జంగిరెడ్డి, కోదాడశ్రీను, రాజేశ్‌, రమేశ్‌, బాబు, ప్రసాద్‌, మల్లిక్‌తేజ, మల్లంమధు, బాబుశాస్త్రి, వినోద్‌, పాల్గొన్నారు.

​తెలంగాణలో 30 ఏండ్లుగా పనిచేస్తున్న సీనియర్‌ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్‌ కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *