సూపర్‌ ఐడియా.. రిక్షా తొక్కలేక అతనేం చేశాడంటే..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
సూపర్‌ ఐడియా.. రిక్షా తొక్కలేక అతనేం చేశాడంటే..!

నిజంగా ఇలాంటి ఐడియాలు మన ఇండియన్స్‌కే వస్తాయి. రిక్షా లాగలేక ఈ రిక్షావాలా తన రిక్షాను మోటారు వాహనంలా మార్చేశాడు. ఇప్పుడు తొక్కే శ్రమ లేకుండా దానిలో ఆయిల్‌ కొట్టించుకొని హ్యాపీగా వెళ్లిపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి వస్తువులను తీసుకువెళ్లే ఓ రిక్షాతో పెట్రోలు బంకుకి వచ్చాడు. రిక్షావాలాకి పెట్రోలు బంకులో పనేంటబ్బా అని మిగతా వాహనదారులు వింతగా చూస్తున్నారు. అతను పెట్రోలు కొట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆయిల్‌ కొట్టమని డబ్బులిచ్చాడు. డబ్బు తీసుకొని బంకు సిబ్బంది ఆ రిక్షాకు ఉన్న ట్యాంకర్‌లో ఆయిల్‌ నింపారు. మీరు విన్నది నిజమే.. ఆ రిక్షావాలా తన రిక్షాకి పాత మోటారు సైకిల్‌ ఇంజిన్‌ను బిగించాడు. వెనుక చక్రాలకు ముందు చక్రానికి కనెక్ట్‌ చేస్తూ చైన్‌ కూడా ఉంది. దాని పక్కనే సైలెన్సర్‌ కూడా బిగించాడు. కిక్‌ కొట్టడానికి కిడ్‌ రాడ్‌ సెట్‌ చేశాడు. మరోవైపు ఇంజిన్‌కి ఫ్యూయల్‌ అందేలా ఓ మూలన ఆయిల్‌ ట్యాంక్‌ అమర్చాడు. మొత్తానికి రిక్షాను అద్భుతమైన జుగాడ్‌గా తయారు చేశాడు. ఈ రిక్షాలో లీటరు ఆయిల్‌ కొట్టిస్తే 35 కిలోమీటర్లు మైలేజ్‌ ఇస్తుందట. రిక్షావాల ఐడియాకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే.. పట్టిందల్లా బంగారమే

పనిమనిషితో యవ్వారం.. ఉరితాడుకు పెళ్లాం..! సస్పెన్స్‌తో నరాలు తెగిపోవడం పక్కా

వేసవి తాపం నుంచి తప్పించుకోడానికి ఇతని ఐడియా అదుర్స్‌

ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే అద్భుతమైన ప్రయోజనాలు

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

​రిక్షావాలా.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. అయితే అనారోగ్యం చేసినా .. వృద్ధులైనా ఎక్కువ దూరం రిక్షా లాగడం కష్టమే. అదికూడా లోడుతో రిక్షా తొక్కడం మరీ కష్టం. ప్రస్తుత కాలంలో ఈ రిక్షాలు అందుబాటులోకి వచ్చినా అవి కొనుక్కునే స్తోమత లేని పేదవాళ్లు ఇంకా రిక్షాలను కాళ్లతో తొక్కుతూనే ఉన్నారు. అలాంటి ఓ రిక్షావాలా సూపర్‌ ఐడియా వేశాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *