సైబర్‌క్రైమ్‌తో జాగ్రత్త

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

రోజురోజుకూ తీవ్రమవుతున్న డిజిటల్‌ మోసాలు
– ఏటా పెరుగుతున్న కేసులు
– రూ.లక్షల మొత్తంలో కోల్పోతున్న బాధితులు
– అత్యాశకు వెళ్లొద్దు.. అప్రమత్తంగా ఉండాలి : సైబర్‌ నిపుణులు
దేశంలో సైబర్‌ క్రైమ్‌లు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తమ పాలనలో ఆన్‌లైన్‌లావాదేవీలు పెరిగాయి పారదర్శకతకు ఇది అద్దం పడుతున్నదని మోడీ సర్కారు చెప్పుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగిన దేశంగా భారత్‌ ఉన్నదని ఊదరగొడుతున్నది. అయితే, ఈ ఆన్‌లైన్‌ లావాదేవీల కారణంగా ఎంతో మంది ప్రజలు సైబర్‌ క్రైమ్‌ బాధితులుగా మిగిలిపోతున్నారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బునంతా సైబర్‌ నేరగాళ్ల మోసంతో క్షణాల్లో కోల్పోతున్నారు.

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన ఒక బాధితురాలు జీవిత కాలమంతా కష్టపడి పోగు చేసుకున్న డబ్బును ఇటీవల క్షణాల్లో కోల్పోయింది. 2024లో మొత్తం రూ.1935 కోట్ల విలువైన 1.23 లక్షల సైబర్‌ కేసులలో ఇదీ ఒకటి. ఇది 2022లో నమోదైన డిజిటల్‌ అరెస్టుల సంఖ్యకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇక్కడ స్కామర్లు బాధితులకు అత్యధిక డబ్బు ఆశ చూపటమో, ఇతర కేసులు మీ మీద నమోదయ్యాయని పోలీసు అధికారులుగానో ఫోన్లు చేస్తారు. ఇందుకు వాట్సాప్‌, టెలిగ్రామ్‌లను విరివిగా వాడుతారు. దీంతో డబ్బు ఆశతోనో, పరువు పోతుందన్న భయంతోనే.. ఎలాంటి విషయాలూ తెలుసుకోకుండానే బాధితులు ముందడుగు వేస్తున్నారు. అయితే, ఈ అనాలోచిత చర్యలే వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసు, సైబర్‌ భాగాలు నివేదించిన ధోరణులను ట్రాక్‌ చేస్తూ ఒక ఆంగ్ల వార్త సంస్థ గురుగ్రామ్‌లోని 44 ఏండ్ల అడ్వర్టైజింగ్‌ ఎగ్జిక్యుటివ్‌కు సంబంధించిన ఒక కేసును పరిశీలించింది. ఈమె సైబర్‌ బాధితురాలు. ఆన్‌లైన్‌లో తన డబ్బును పోగొట్టుకున్నది. ”మీలాంటి చదువుకున్న ఒక మహిళ సైబర్‌ బాధితుల మాటలను నమ్మి ఎలా తప్పు చేస్తున్నారు? అని దర్యాప్తు అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ఇలాంటి సైబర్‌ మోసాల తర్వాత చాలా మంది అవమానం, అపరాధ భావనతో మౌనంగా ఉంటున్నారు. సైబర్‌ నిందితులపై ఫిర్యాదు చేయటంలో శ్రద్ధ చూపటం లేదు. దీనికి భయం, అవగాహనారాహిత్యం, సమయాభావం వంటి పరిస్థితులు తోడవుతున్నాయి. ఇది సైబర్‌ నేరస్థులకు అనుకూలంగా మారుతున్నది” అని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత, ఆమె ‘తన జీవిత కాల పొదపు డబ్బు’ను తిరిగి పొందటానికి అనేక తలుపులు తట్టింది. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు కూడా లేఖ రాసింది. ఆమె కేసును ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసిన గురుగ్రామ్‌ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించిచేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి సిట్‌ ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఒక సహకార బ్యాంకు డైరెక్టర్‌, ఆయన ఇద్దరు ‘సహచరులు’ సహా మగ్గురిని అరెస్ట్‌ చేసి, సుమారు రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నది. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సైబర్‌ మోసం విభాగం ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) కూడా సిట్‌ను అప్రమత్తం చేసింద. హైదరాబాద్‌లో దాని దర్యాప్తునకు సంబంధించి 11 మ్యూల్‌ ఖాతాలు 181 ఇతర ఫిర్యాదులలో కేంద్రంగా ఉన్నాయి. దర్యాప్తు అధికారులు వెల్లడిం చిన సమాచారం ప్రకారం మూడు నెలల్లో ఈ 11 ఖాతాల ద్వారా మొత్తం రూ.21 కోట్లు మనీ లావాదేవీలు జరిగాయి. ఈ నిధులలో కొన్నింటిని క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయటానికి ఉపయోగించినట్టు కొన్ని ఆధారాలు కూడా సూచిస్తున్నాయి.

సైబర్‌ నేరాలు ఇలా..!
దేశంలోని డిజిటల్‌ అరెస్ట్‌లు, సంబంధిత సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ఆధారంగా కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి బండి సంజరు రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2022లో 39,925 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సైబర్‌ మోసపూరిత చర్యలోల్లో కోల్పోయిన నగదు విలువ రూ.91.14 కోట్లుగా ఉన్నది. ఇక 2023లో 60,676 ఘటనలు నమోదు కాగా.. నగదు విలువ రూ.339.03 కోట్లుగా ఉన్నది. 2024లో ఘటనల సంఖ్య 1,23,672కు, అంటే రెండింతలకు పైగా పెరిగిపోయింది. కోల్పోయిన నగదు విలువ మొత్తం కూడా కిందటేడాదితో పోలిస్తే 6 రెట్లకు పైగా పెరిగింది. అది రూ.1935.51 కోట్లకు ఎగబాకింది. ఇది పెరుగుతున్న సైబర్‌ నేరాల పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఈ ఏడాది రూ.210.21 కోట్ల మేర మోసాలకు సంబంధించి 17,718 ఘటనలు నమోదయ్యాయి.

బాధితులు 1930కి కాల్‌ చేయాలి
సైబర్‌ దోపిడీకి గురైతే బాధితులు భయపడకూడదనీ, 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. నేరం జరిగిన 24 గంటల్లోపు చేస్తే ఇది మరింత మంచిదని చెప్తున్నారు. లావాదేవీలకు సంబంధించిన ఫోటోలు, ఇతర ఆధారాలు ఏవైనా ఉంటే సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే, అధికార యంత్రాంగాలు మనం కోల్పోయిన డబ్బును నిందితుల ఖాతాల నుంచి నిలుపుదల చేసి, రికవరీ చేసేందుకు ప్రక్రియ సులభతరమవుతుందని వివరిస్తున్నారు.

The post సైబర్‌క్రైమ్‌తో జాగ్రత్త appeared first on Navatelangana.

​– రోజురోజుకూ తీవ్రమవుతున్న డిజిటల్‌ మోసాలు– ఏటా పెరుగుతున్న కేసులు– రూ.లక్షల మొత్తంలో కోల్పోతున్న బాధితులు– అత్యాశకు వెళ్లొద్దు.. అప్రమత్తంగా ఉండాలి : సైబర్‌ నిపుణులుదేశంలో సైబర్‌ క్రైమ్‌లు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తమ పాలనలో ఆన్‌లైన్‌లావాదేవీలు పెరిగాయి పారదర్శకతకు ఇది అద్దం పడుతున్నదని మోడీ సర్కారు చెప్పుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగిన దేశంగా భారత్‌ ఉన్నదని ఊదరగొడుతున్నది. అయితే, ఈ ఆన్‌లైన్‌ లావాదేవీల కారణంగా ఎంతో మంది ప్రజలు సైబర్‌ క్రైమ్‌ బాధితులుగా మిగిలిపోతున్నారు.
The post సైబర్‌క్రైమ్‌తో జాగ్రత్త appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *