స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

Follow

- మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్ రూరల్, జూన్ 18 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎ ప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. బుధవారం కొల్లాపూర్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు నెలకు రూ.2500, కల్యాణలక్ష్మికి తులం బంగారం, పింఛన్ల పెంపు వంటి అనేక పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, కిషన్‌నాయక్, విండో డైరెక్టర్ నర్సింహ, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాంబశివుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, నాయకులు సురేందర్‌రావు, భాస్కర్‌రావు, ఖాదర్‌పాషా,వెంకటస్వామి, జంబులయ్య పాల్గొన్నారు.
కక్ష్యపూరితంగానే కేసులు..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని, పదేండ్లు రాష్ర్టాన్ని అభివృద్ధిలో నడిపిన వారిని వేధించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలన చేతగాక, ధైర్యంగా ఎదుర్కొనే దమ్ములేక కాళేశ్వరం, ఈ ఫార్ములా రేస్ అంటూ విచారణ పేరుతో కక్ష్యసాధింపు చర్యలు చేపట్టడం సరికాదన్నారు. సింగోటం, గోపల్‌దిన్నె రిజర్వాయర్ పనులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎ ప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. బుధవారం కొల్లాపూర్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.