స్థానిక పోరులో సత్తా చాటాలి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Gongidi Mahender Reddy
  • డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి
  • బీఆర్‌ఎస్‌లో చేరిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మల్లమ్మ

ఆత్మకూరు(ఎం),జూన్‌ 30: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటాలని డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నార్కట్‌పల్లి మల్లమ్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు స్వామి సోమవారం యాదగిరిగుట్టలోని గొంగిడి మహేందర్‌రెడ్డి నిలయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆపార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి నేడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు.

ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రైతుభరోసా రుణమాఫీ అమలుకాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత హామీలను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎండగట్టాలని సూచించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను నేరవేర్చేవరకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కొప్పుల హరిదీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు బాషబొయిన ఉప్పలయ్య, జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరె భిక్షపతి, బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌రెడ్డి, యువజన విభాగం మండలాధ్యక్షుడు శంతన్‌రాజు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు పంజాల వెంకటేశ్‌గౌడ్‌, నిర్మల, రామచంద్రయ్య, శ్రీరాములు, కూరెళ్ల బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎరుకల స్వామి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిక..

రాజాపేట, జూన్‌ 30 : మండలంలోని బేగంపేట పాల సొసైటీ చైర్మన్‌ బొమ్మగాని రామస్వామి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి మా జీ డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు మహేందర్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమం లో మండల బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ సం దిళ్ల భాసర్‌ గౌడ్‌ మండల ప్రధాన కార్యదర్శి భోగ హరినాథ్‌ పాముకుంట గ్రామ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ము లుగు సోమలింగం మాజీ సర్పంచ్‌ పంబ కరుణాకర్‌, పాల సొసైటీ చైర్మన్‌ నీల భిక్షపతి, నీల రమేశ్‌, కూతురు నరసింహులు తోట మల్లేశం తదితర నాయ కులు పాల్గొన్నారు.

​త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటాలని డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నార్కట్‌పల్లి మల్లమ్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు స్వామి సోమవారం యాదగిరిగుట్టలోని గొంగిడి మహేందర్‌రెడ్డి నిలయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *