10.70 లక్షల విలువైన నిషేధిత విదేశీ సిగరేట్లు స్వాధీనం

Follow

మలక్ పేట, జూన్ 30: నిషేధిత విదేశీ సిగరెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న గోదాంపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, చాదర్‌ఘాట్ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి.. యజమాని మహమ్మద్ ఫైజల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాంపల్లి ట్రూప్‌బజార్‌కు చెందిన మహమ్మద్ ఫైజల్(31) సైదాబాద్ ఫరా కాలనీలో ఉంటూ..నిషేధిత విదేశీ సిగరేట్ల వ్యాపారం చేస్తున్నాడు.
అక్బర్‌బాగ్‌లో గోదాం ను ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ద్వారా విదేశీ బ్రాండెడ్ సిగరెట్లను తెప్పించుకొని..పాన్ షాపులు, కిరాణా షాపులకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. చాదర్‌ఘాట్ పోలీసులతో కలిసి గోదాంపై దాడిచేసి మహమ్మద్ ఫైజల్‌ను అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రూ.10 .70 లక్షల విలువైన నిషేధిత విదేశీ బ్రాండెడ్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత విదేశీ సిగరెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న గోదాంపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, చాదర్‌ఘాట్ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి.. యజమాని మహమ్మద్ ఫైజల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాంపల్లి ట్రూప్‌బజార్‌కు చెందిన మహమ్మద్ ఫైజల్(31) సైదాబాద్ ఫరా కాలనీలో ఉంటూ..నిషేధిత విదేశీ సిగరేట్ల వ్యాపారం చేస్తున్నాడు.